BigTV English

RRB Recruitment: నిరుద్యోగులకు RRB అదిరిపోయే న్యూస్, టెన్త్ పాసైనా ఇకపై ఆ ఉద్యోగాలు పొందవచ్చు!

RRB Recruitment: నిరుద్యోగులకు RRB అదిరిపోయే న్యూస్, టెన్త్ పాసైనా ఇకపై ఆ ఉద్యోగాలు పొందవచ్చు!

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ నిరుద్యోగులకు సూపర్ డూపర్ న్యూస్ చెప్పింది. లెవెల్ 1 పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో కీలక మార్పులు చేసింది. ఇకపై 10వ తరగతి పాసైన వాళ్లు కూడా లెవెల్ 1 పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. టెన్త్ తో పాటు ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్లు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు లెవెల్ 1 ఉద్యోగాలు పొందాలంటే 10వ తరగతి పాస్ కావడంతో పాటు NAC, ITI డిప్లొమా కచ్చితంగా ఉండాలనే నిబంధన ఉండేది. తాజాగా ఈ నిబంధనలను సవరించింది. టెన్త్ ను కనీస విద్యార్హతగా గుర్తించింది. ఈ విషయానికి సంబంధించి రైల్వే సంస్థ అన్ని జోన్లకు సమాచారం అందించింది.


32 వేల లెవెల్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఇక లెవెల్ 1 రైల్వే ఉద్యోగాల్లో వివిధ డిపార్ట్​మెంట్​ లో అసిస్టెంట్లు, పాయింట్స్ ​మెన్, ట్రాక్ మెయింటెనర్స్ లాంటి పోస్టులు ఉంటాయి. తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లెవెల్ 1కు సంబంధించి 32,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనలు వర్తిస్తాయని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.


Read Also: టికెట్లపై 75 శాతం డిస్కౌంట్.. విద్యార్థులకు రైల్వే సంస్థ స్పెషల్ రాయితీల గురించి తెలుసా?

లెవెల్ 1 పోస్టులకు వయో పరిమితి ఎంత ఉండాలి?

రైల్వే సంస్థలో ట్రాఫిక్‌, ఇంజినీరింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లోని పోస్టులకు వయో పరిమితి 18 నుంచి 36 ఏండ్లు ఉండాలి. జనవరి 7 వరకు ఈ వయసులోపు ఉండాలి. అటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయో పరిమితిలో కాస్త సడలింపు ఇస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అటు ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌  తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇక లెవల్ 1 ఉద్యోగాలకు సంబంధించి స్టార్టింగ్ సాలరీ రూ. 18 వేల వరకు ఉంటుంది.

Read Also: ఇండియన్ రైల్వేలో మరో అద్భుతం, నదీ గర్భంలో దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?

అప్లికేషన్ ఫీజు ఎంత అంటే?

ఇక రైల్వే లెవెల్ 1 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఫ్లీజు వివరాలను వెల్లడించింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించింది. ఇక ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్, ఈబీసీ అభ్యర్థులకు రూ. 250గా నిర్ణయించింది. స్టేజ్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత జనరల్, ఓబీసీ  అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో రూ. 400 రీఫండ్ అవుతుందని రైల్వే బోర్డు వెల్లడించింది. మిగిలిన అభ్యర్థులకు పూర్తి స్థాయి అమౌంట్ రీఫండ్ అవుతుందని తెలిపింది.

Read Also: సంక్రాంతి వేళ సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు

Related News

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Big Stories

×