Srikanth: ఏపీలో మరో ల్యాండ్ స్కామ్ కలకలం రేపుతోంది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ఓ ముఠా కొట్టేసిందనే ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ అంశంలో మాజీ సీఎం జగన్ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. తనను బెదిరించి 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను మాజీ సీఎం జగన్ పీఎ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్టర్ సింగ్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయితే సింగ్ ఏసీబీ అదుపులో ఉన్నాడు. రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విచారణ జరగాల్సి ఉంటుందని.. రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. గతేడాది ఆయన ఇంట్లో ఏసీబీ సోదాల తర్వాత ఆయన పరారయ్యాడు. మరోవైపు ఈ విషయంపై శ్రీకాంత్ స్పందించాడు. తాను తప్పు చేసినట్టు రుజువు చేయాలని సవాల్ చేశాడు.
చీమకుర్తి శ్రీకాంత్.. జబర్దస్త్ నటి రీతూ చౌదరి భర్త కావడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు శ్రీకాంత్.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బినామీ అని ఆరోపిస్తున్నాడు సింగ్. ఈ భూములన్నీ విశాఖ, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కడియం ప్రాంతాల్లోనే ఉన్నాయని సింగ్ వివరణ. అక్రమ రిజిస్ట్రేషన్ ఒప్పుకోకపోవడంతో తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించారని ఏసీబీకి ఫిర్యాదు చేశాడాయన. విడుదల చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని తన కొడుకును డిమాండ్ చేశారని కంప్లైంట్ చేశాడు. కోటి రూపాయలు తమ దగ్గర వసూలు చేసి తనను విడుదల చేసిన తర్వాత బలవంతంగా ఆ భూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.
సింగ్ వెర్షన్ ఇలా ఉంటే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్ కూడా రెస్పాండ్ అయ్యాడు. తన దగ్గర 700 కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే ఎవరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని ఆయన చెబుతున్నారు. ఆరోపణలు చేస్తున్న సింగ్ తన స్నేహితుడని శ్రీకాంత్ వివరణ. ఆయనే తనకు 40 లక్షలు ఇవ్వాలని చెబుతున్నాడు. ఈ ఆరోపణల వలన తన ఫ్యామిలీలో కూడా గొడవలు జరుగుతున్నాయిన అంటున్నాడు శ్రీకాంత్.’
Also Read: చీమకుర్తి.. జగన్ బినామీ? వైసీపీని వణికిస్తున్న రూ.700 కోట్ల భూకబ్జా కేసు
ఇద్దరి వెర్షన్లు విన్న తర్వాత ఎవరి హస్తం ఏంటో తేలాల్సి ఉంది. ఇప్పటికే సింగ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. కాబట్టి.. ఈ 700 కోట్ల రూపాయల భూ కబ్జా ఆరోపణల్లో నిజానిజాలు తేలాల్సి ఉంది.