E-Paper
Advertisement

TTD BIRRD: రూ. 2.50 లక్షల వరకు జీతం.. టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

TTD BIRRD: రూ. 2.50 లక్షల వరకు జీతం.. టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు
Advertisement

ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది శుభవార్త..  తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) అనుబంధ సంస్థ అయిన బర్డ్ (BIRRD) ట్రస్ట్ ఆసుపత్రిలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి ఇది అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, వెకెన్సీ వివరాలు, వయస్సు, దరఖాస్తు విధానం, జీతం తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తిరుపతి కేంద్రంగా సేవలు అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థలో వివిధ స్పెషాలిటీ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికన రెండేళ్ల కాలపరిమితికి నియామకం చేసుకుంటారు. మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

Advertisement

మొత్తం వెకెన్సీల సంఖ్య: 30

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో బోధన సిబ్బందితో పాటు క్లినికల్ విభాగాలకు ప్రాధాన్యత కల్పించారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్, రెసిడెంట్ డాక్టర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

విద్యార్హత:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగాలను బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ (MBBS) తో పాటు ఎంఎస్ (MS) లేదా డీఎన్‌బీ (DNB) ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హతతో పాటు సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం కూడా చూస్తారు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు కేటగిరీని బట్టి 45 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు మించకూడదు. అనుభవజ్ఞులైన వైద్యులకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు టీటీడీ నిబంధనల ప్రకారం భారీ జీతాలు ఇస్తారు. ప్రొఫెసర ఉద్యోగానికి నెలకు రూ. 2,50,000, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ. 2,00,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి నెలకు రూ. 1,50,000, మెడికల్ ఆఫీసర్/రెసిడెంట్ డాక్టర్ ఉద్యోగానికి రూ. 80,000 నుంచి రూ. 1,00,000 మధ్య జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:

ఈ పోస్టులకు అభ్యర్థులను కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక చేస్తారు. మెరిట్ ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్ ఫామ్‌ను డైరెక్టర్ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ టీటీడీ తిరుపతి – 517501 ఆంధ్రప్రదేశ్ చిరునామాకు అందజేయాలి..

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 16, 2026 దరఖాస్తుకు చివరి తేదీగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను అధికారులు పరిశీలించరు.

వైద్య సేవా రంగంలో అంకితభావంతో పనిచేసే ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. మరింత సమాచారం కోసం లేదా నోటిఫికేషన్ కు సంబంధించి  ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.tirumala.org/

ALSO READ: NTPC Recruitment: రూ.2,40,000 జీతంతో ఉద్యోగాలు.. ఇలాంటి జాబ్ కొడితే డబ్బులే డబ్బులు, పూర్తి వివరాలివే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×