SBI PO Prelims: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను కాసేపటి క్రితమే విడుదల చేసింది. గత నెల 8, 16, 24, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. పీవో ప్రిలిమ్స్ ఫలితాలను అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కింది లింక్ ను క్లిక్ నేరుగా ఫలితాలను తెలుసుకోండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in/web/careers/crpd/po-pre-2024-results
దేశ వ్యాప్తంగా 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాల ఖాళీల భర్తీని చేపడుతోంది. ఈ క్రమంలో ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహించి.. ఫలితాలను కూడా విడుదల చేసింది. ఎస్బీఐ లో ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్‌లో..
ప్రిలిమనరీ పరీక్షలో 100 మార్కులతో కూడిన ఆన్ లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. సెక్షన్ కటాఫ్ ఏం ఉండదు. ఓవరాల్ మెరిట్ ఆధారంగా ఒక్కో కేటగిరీ లోని ఖాళీల సంఖ్యకు సుమారు 10 రెట్లు ఫేజ్-2కు షార్ట్ లిస్ట్ చేయనున్నారు.
మెయిన్ పరీక్షలో..
ఈ దశలో ఆబ్జెక్టివ్ టెస్ట్ 200 మార్కులకు ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ తర్వాత వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్ల ను టైప్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు డిస్క్రిప్టివ్ పేపర్ సహా ప్రతి విభాగంలో కనీస అర్హత మార్కులు సాధించి తీరాలి. మెరిట్ ఆధారంగా కేటగిరీల వారీగా ఖాళీల సంఖ్యకు మూడు రెట్లు ఎక్కువగా ఫేజ్-3 కి షార్ట్ లిస్ట్ చేస్తారు.
ALSO READ: JOBS: టెన్త్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. వేతనం రూ.46,000.. నేడే లాస్ట్ డేట్
ఫైనల్ సెలక్షన్ రౌండ్..
ఈ దశలో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్ సైజ్ 20 మార్కులకు నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. కనీస అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయించిన విధంగా ఉంటాయి. సైకోమెట్రిక్ పరీక్షలో తేలిన అంశాలను ప్యానెల్ కు సమర్పించవచ్చు. మెయిన్స్, ఫైనల్ సెలక్షన్ మార్కులను 100కు పెంచుతారు. ప్రిలిమినరీ పరీక్ష మార్కులను తుది మెరిట్ జాబితాకు పరిగణనలోకి తీసుకోరు. ప్రతి కేటగిరీలో టాప్ ర్యాంక్ సాధించిన అభ్యర్థుల నుంచి ఎంపిక చేస్తారు. ప్రిలమ్స్, మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షల్లో ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సమాధానం గుర్తించని ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. మొత్తం 600 పీవో పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ: BEL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతమైతే రూ.90,000.. ఇంకా 4 రోజులే భయ్యా..
ALSO READ: Telangana Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 390 ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే..!