BigTV English
Advertisement

Telangana Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 390 ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే..!

Telangana Jobs: గుడ్ న్యూస్.. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 390 ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే..!

TG Assistant Executive Engineer Jobs: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈ) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఉన్నఅభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉండనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల స్కీం కోసం రేవంత్ సర్కార్ 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ విధానంలో ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ: BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లక్షల్లో జీతం భయ్యా..


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కూడా సరిపడా సిబ్బంది లేనట్టు సమాచారం. దీంతో ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్‌ ఇంజనీర్లకు అప్పగించనున్నట్లు తెలిసింది. మొదట 390 మందిని ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించుకునేందుకు మ్యాన్‌పవర్‌ సప్లయర్స్‌కు బాధ్యతను అప్పగించింది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 390

ఈ నోటిఫికేషన్ లో 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 11

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 4

విద్యార్హత: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 44 ఏళ్లు మించరాదు. కనిష్ట వయస్సు 18 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.33,800 వేతనం ఉంటుంది.

నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అఫీషియల్ వెబ్ సైట్ చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://tghousing.cgg.gov.in/

అప్లికేషన్ లింక్: https://tghousing.cgg.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇది మంచి అవకాశం. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.33,800 వేతనం ఉంటుంది.  మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 390

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 11

ALSO READ: AAI Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో 309 ఉద్యోగాలు.. రూ.1,40,000 జీతం..

ALSO READ: DMHO: గుడ్ న్యూస్.. టెన్త్ క్లాస్‌తో ఆ జిల్లాలో ఉద్యోగాలు.. మంచి వేతనం. వారం రోజులే గడవు

Related News

BEML Notification: భారత్ ఎర్త్ మూవర్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.40000.. ఇంకెందుకు ఆలస్యం

NSUT Notification: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో 184 ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా జీతం, పూర్తి వివరాలివే..

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

Big Stories

×