E-Paper
Advertisement

టెన్త్ అర్హతతో 1644 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్, ఇంకెందుకు ఆలస్యం

టెన్త్ అర్హతతో 1644 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. భారతీయ రైల్వే పరిధిలోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. 2026-27 సంవత్సరానికి గాను రాయ్‌పుర్ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కేంద్ర ప్రభుత్వ యాక్ట్ అప్రెంటిస్ నిబంధనల ప్రకారం ఈ నియామకాలు చేపడుతున్నారు.

మొత్తం 1,644 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో రాయ్‌పుర్ డివిజన్ పరిధిలోని డీఆర్‌ఎం ఆఫీసులో 1,363 పోస్టులు ఉన్నాయి. అలాగే వేగన్ రిపేర్ షాప్ రాయ్‌పుర్ పరిధిలో 281 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాంకేతిక విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, పెయింటర్ వంటి ట్రేడులలో శిక్షణ పొందే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ వంటి విభాగాల్లో కూడా పోస్టులు కేటాయించారు.

పదో తరగతితో పాటు ఐటీఐ పూర్తి చేసిన వారికి ఇది మంచి సువర్ణావకాశం. రైల్వే రంగంలో ప్రాక్టికల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి భవిష్యత్తులో రైల్వే నియామకాల్లో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంటుంది.

Advertisement

విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండటం తప్పనిసరి.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 2026 మే 5 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారు. మెట్రిక్యులేషన్ ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల సగటు ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు.

చివరి తేది: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి 2026 జూన్ 4 వరకు గడువు ఇచ్చారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదివి ఫాం నింపాల్సి ఉంటుంది. అవసరమైన ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

స్టైఫండ్: ఈ శిక్షణ కాలంలో నిబంధనల ప్రకారం స్టైపెండ్ కూడా చెల్లిస్తారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://secr.indianrailways.gov.in/

ALSO READ: రూ.20 ప్రభుత్వ పథకంతో రూ.2 లక్షలు ప్రయోజనం.. ఎలా అప్లై చేయాలంటే?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×