Bank of India Recruitment: నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై అభ్యర్థులకు ఇది సువర్ణవకాశంగా చెప్పవచ్చు. ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థలు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది.
ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ (ఎంఎంజీఎస్-2) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 4 దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
ALSO READ: TGPSC Group-1,2,3 Exams: ఈ ఏడాది మళ్లీ గ్రూప్-1,2,3 నోటిఫికేషన్లు.. ఈ తప్పులు చేయకండి..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 10
కేటగిరి వారీగా ఉద్యోగాలు
ఎస్సీ: 1
ఓబీసీ: 2 పోస్టులు
ఈడబ్ల్యూఎస్: 1
జనరల్: 6 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ (ఎంఎంజీఎస్-2) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 4 లోగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వేతనం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల జీతం రూ.64,820 నుంచి రూ.93,960 వరకు ఉంటుంది. మంచి వేతనం అందజేయనున్నారు. కాబట్టి అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోండి.
వయస్సు: కనీస వయస్సు 25 ఏళ్ల వయస్సు ఉండాలి. స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 40 ఏళ్ల వయస్సు మించరాదు. (కనిష్ట వయస్సు: 25 ఏళ్లు, గరిష్ట వయస్సు: 40 ఏళ్లు)
*వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ 100 మార్కులకు గానూ కేటాయిస్తారు. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరి అభ్యర్థులకు 50 శాతం మార్కులు గానూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు క్వాలిఫియింగ్ మార్కులుగా నిర్ధారించారు. గ్రూప్ డిస్కషన్ ను 30 మార్కులుగా కేటాయిస్తారు. రెండింటిలో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. సేమ్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు డేట్ ఆఫ్ బర్త్ చూసి జాబ్ ఇస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://bankofindia.co.in/
అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతం ఉంటుంది.
ALSO READ: CBI Recruitment: సీబీఐలో 1000 ఉద్యోగాలకు ఎల్లుండే లాస్ట్ డేట్ మిత్రమా..!
ముఖ్యమైనవి:
మొత్తం పోస్టులు సంఖ్య: 10
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 4