BigTV English

Manchu Manoj: మంచు వివాదం.. సడెన్ గా ఎన్టీఆర్ వీడియో పోస్ట్ చేసిన మనోజ్.. అసలేమైంది.. ?

Manchu Manoj: మంచు వివాదం.. సడెన్ గా ఎన్టీఆర్ వీడియో పోస్ట్ చేసిన మనోజ్.. అసలేమైంది.. ?

Manchu Manoj: మంచు వారి కుటుంబంలో మళ్లీ మంటలు చెలరేగాయి. ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది అనుకొనేలోపు మంచు మనోజ్ ను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. తాజాగా తిరుపతి జిల్లాలోని భాకరాపేట పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డిన్నర్ చేస్తుండగా పోలీసులు వచ్చి మనోజ్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక కొద్దిసేపటికే మనోజ్ ఒక వీడియో ద్వారా అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు.


“మా కాలేజీ కోసం, మా కాలేజీ ఎదురుగా పని చేసుకుంటున్నా స్టాఫ్ కోసం, నేను మొదటి నుంచి దాని గురించి మాట్లాడుతుంటే దానిని పక్కన పెట్టేసి ఇంకేవేవో వివాదంలోకి తీసుకొస్తున్నారు. నా మీద అటాక్ చేస్తూ నా కుటుంబ సభ్యుల్ని లాగుతున్నారు. నేను భయపడతాను అనుకుంటున్నారేమో అది జరగని పని. నా మీద, నా భార్య మీద దాదాపు 30కి పైగా కేసులు వేశారు. నిజానికి ఒకే వెర్షన్ ఉంటుంది, అబద్దానికి చాలా వెర్షన్లు ఉంటాయి. ఇది జరిగింది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా వార్తలు రాస్తున్నారు నా దగ్గర నిజంగా ఫ్యాక్ట్ ఉంది. నా తప్పైతే నా కాలర్ పట్టుకుని అడగండి” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఇక్కడితో ఆగకుండా మనోజ్ మరో వీడియోలో సోమవారం రాత్రి ఏం జరిగిందో చెప్పుకొచ్చాడు. ” ఎలాంటి తప్పు చేయలేదు ఎక్కడ కూడా మిస్ బిహేవ్ చేయలేదు. నేను చట్టానికి లోబడే సహకరించాను. పోలీసులు వచ్చి నాపై దురుసు గా వ్యవహరించారు.సీఎం దగ్గర నుంచి వచ్చానని చెప్పి ముందుగా భయపెట్టించే ప్రయత్నం చేశారు. సీఎం గారి పేరు ఎందుకు చెప్తున్నారని పోలీసులను నిలదీశాను. సీఎం గారి బందోబస్తు చూసుకొని వస్తున్నామని మళ్లీ మాట మార్చారు.  సైరన్ వేసుకుని రిసార్ట్ లో పోలీసుల హంగామా చేశారు.


Pooja Hegde: మరో ఐటెంసాంగ్ లో బుట్టబొమ్మ.. ఈసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్.. ?

నేను నా కారులో పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగాను.. దానికి ఎస్ఐ అక్కడి నుంచి ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు.. చివరికి సిఐ గారు ఫోన్ చేస్తే విషయం మొత్తం చెప్పాను. నా దగ్గర మొత్తం అన్ని రికార్డులు ఉన్నాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. యూనివర్సిటీ ముందు ఉన్న వాళ్ల కోసం నేను పోరాటం చేస్తున్నాను.. విద్యార్థులకు న్యాయం చేయమని పోరాటం చేస్తున్నాను.వాళ్లపైన దాడులు చేసి విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ఏమి చేయట్లేదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక తాజాగా మంచు మనోజ్ ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమరం భీముడో వీడియో సాంగ్ ను  ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ” కొమరం భీముడో సాంగ్.. ఇలాంటి మ్యాజిక్ ను అందించినందుకు చిత్రబృందానికి థాంక్స్ చెప్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. అసలు సడెన్ గా మనోజ్ ఈ వీడియోను పోస్ట్ చేయడం వెనుక అర్ధం ఏంటి.. ? అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. 2022లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో చరణ్ ఆంగ్లేయుల వద్ద పనిచేసే పోలీస్ గా కనిపించగా.. ఎన్టీఆర్ గోండు జాతిని కాపాడుకొనే కాపరిగా కనిపించాడు. తన తెగవారిని కాపాడడం కోసం, వారిలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడం కోసం.. కొమరం భీమ్  తన రక్తాన్ని చిందిస్తాడు. ఆ సమయంలోనే ఈ సాంగ్ వస్తుంది. ఇప్పుడు మనోజ్ కూడా తనవారిని కాపాడడం కోసం ఇన్ని కష్టాలు పడుతున్నాడు. దీనికి సింబాలిక్ గానే ఈ వీడియో సాంగ్ ను పోస్ట్ చేసి ఉంటాడని అంటున్నారు. మరి అసలు ఈ సాంగ్ ఈ సమయంలో మనోజ్ ఎందుకు పోస్ట్ చేసాడో తెలియాలంటే అతనే నోరు విప్పాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×