Ramya Krishna: సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya krishna) 50+ ఏజ్ లో ఉన్నా కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉంది అంటే ఈ హీరోయిన్ క్రేజ్ ఇండస్ట్రీలో ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. సినిమాలో హీరోయిన్ అవకాశాలు తగ్గాక కూడా బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీలో రాజమాత శివగామి దేవి వంటి పాత్ర పోషించింది. రమ్యకృష్ణ సినీ కెరియర్ లో చెప్పుకోదగ్గ పాత్రలు ఎన్నో ఉన్నాయి.లవర్ గా హీరోతో రొమాన్స్ చేయడం నుండి విలన్ పాత్రలో విలనిజంతో అదరగొట్టడం, తల్లి పాత్రలో ఇరగదీయడం వంటివి రమ్యకృష్ణకే సాధ్యం. అయితే అలాంటి రమ్యకృష్ణకి ఒక మాజీ సీఎం తో ఉన్న సంబంధం గురించి ఒక స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్లు చేశారు. మరి రమ్యకృష్ణ ఆ మాజీ సీఎం మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..? ఇంతకీ ఆ మాజీ సీఎం ఎవరు.. ? డైరెక్టర్ చెప్పిన ఆ విషయం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
మాజీ సీఎంతో రమ్యకృష్ణ బంధం పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
రజినీకాంత్ (Rajinikanth) హీరోగా సౌందర్య (Soundarya)హీరోయిన్ గా, రమ్యకృష్ణ విలన్ గా వచ్చిన ‘నరసింహ’ సినిమా అందరూ చూసే ఉంటారు. కే.ఎస్.రవికుమార్ (కేస్.Ravikumar)డైరెక్షన్లో వచ్చిన నరసింహ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది.ఈ సినిమాలో రజినీకాంత్ సౌందర్యల కంటే ఎక్కువగా నీలాంబరి అనే పాత్రలో నటించిన రమ్యకృష్ణనే ఫేమస్ అయ్యింది.. రమ్యకృష్ణ కెరియర్ లోనే నీలాంబరి పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది.అయితే అలాంటి నీలాంబరి పాత్ర ఓ మాజీ సీఎంని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేశారట. ఇక ఆ మాజీ సీఎం ఎవరో కాదు దివంగత హీరోయిన్ , తమిళనాడు మాజీ సీఎం అయినటువంటి జయలలిత(Jayalalita). కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన నరసింహ సినిమా 1999లో విడుదలైంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే దాదాపు 25ఏళ్లు పూర్తయ్యాయి.అయితే ఈ సినిమా పాతికేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నకే.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ. “ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర తమిళనాడు మాజీ సీఎం జయలలితను స్ఫూర్తిగా తీసుకొని చేశామని తెలియజేశారు. అలాగే ఈ సినిమా చూశాక జయలలిత గారు కూడా సినిమా గురించి అలాగే నీలాంబరి పాత్ర లో నటించిన రమ్యకృష్ణని కూడా మెచ్చుకున్నారు” అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అలా నరసింహ (Narasimha) సినిమాలో జయలలిత గారిని ఉద్దేశించి పెట్టిన నీలాంబరి పాత్రతో జయలలితకి రమ్యకృష్ణ కి మధ్య అనుకోకుండా ఓ రిలేషన్ ఏర్పడినట్టు తెలుస్తోంది.
బ్లాక్ బస్టర్ గా నిలిచిన నరసింహ..
ఇక నరసింహ మూవీ విషయానికొస్తే.. డబ్బు, అందం, చదువు ఉందనే పొగరుతో ఏదైనా సాధించగలను అని నమ్మకం ఉన్న క్యారెక్టర్ ను రమ్యకృష్ణ పోషించింది. ఇందులో రమ్యకృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా సౌందర్య మాత్రం రమ్యకృష్ణ ఇంట్లో పనిమనిషి పాత్రలలో నటించింది. తాను రజనీకాంత్ ను ఇష్టపడి ఉంటుంది అతడిని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది కానీ రజనీకాంత్ ఆమె ఇంట్లో పనిమనిషిని పెళ్లి చేసుకోవడంతో అది ఓర్చుకోలేని రమ్యకృష్ణ రజినీకాంత్ పై పగబట్టి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటుంది. ఒక చివరికి నిజం తెలుసుకొని తనకు తానుగా ప్రాణార్పణ చేస్తుంది. అయితే ఈ సినిమాలో మొదట నీలాంబరి పాత్ర మీనా(Meena)కి వచ్చింది. కానీ ఆమె తల్లి రిజెక్ట్ చేయడంతో అది కాస్త రమ్యకృష్ణ చేతికి వచ్చింది.