Indian Post Recruitment-2025: టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. టెన్త్ పాసై ఉండి డ్రైవింగ్‌కు సంబంధించిన అర్హతలు ఉన్నవారికి ఇది గుడ్ న్యూస్. ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ మొత్తం 25 స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్‌లొ స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 8వ తేది వరకు దరఖాస్తు గడువు ముగియనుంది. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 15
ఇందులో పలు రకాల ఉద్యోగాలున్నాయి. స్టాఫ్ కారు డ్రైవర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి.
రీజియన్ల వారీగా..
పలు రీజియన్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సెంట్రల్ రీజియన్, ఎంఎంఎస్ చెన్నై, సదరన్ రీజియన్, వెస్టరన్ రీజియన్‌లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
సెంట్రల్ రీజియన్‌లో 1 పోస్టు
ఎంఎంఎస్ చెన్నైలో 15 పోస్టులు
సదరన్ రీజియన్‌లో 4 పోస్టులు
వెస్ట్రన్ రీజియన్‌లో 5 పోస్టులు
విద్యార్హత: దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ క్లాస్ పాసై ఉండాలి. అలాగే అభ్యర్థి లైట్, హెవీ మోటారు వెహికల్ చెల్లుబాటు అయ్యే విధంగా డ్రైవింగ్ లైసెన్స్, కనీసం మూడేళ్ల డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ పీరియన్స్ కలిగి ఉంటే సరిపోతుంది.
ఇతర అర్హతలు: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ విభాగంలో ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి డ్రైవింగ్ లైసెన్స్, అర్హతలు కూడా చూస్తారు. దీని తర్వాత ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ కూడా ఇస్తారు.
అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను ఆఫీస్ ఆఫ్ ది సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, నంబర్.37, గ్రీమ్స్ రోడ్, చెన్నై- 600006కు ఫిబ్రవరి 8లోగా పంపాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థుల వయస్సు 56 ఏళ్ల మించి ఉండరాదు. 2025 ఫిబ్రవరి 8వ తేది వరకు వయస్సును లెక్కిస్తారు.
వేతనం: ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులకు 7 వ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం జీతం ఉంటుంది. నెలకు రూ.19,900 జీతం కల్పిస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: www.indiapost.gov.in
తర్వాత ఆఫ్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి సరిగ్గా పూరించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన అన్ని పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు నిర్దేశించిన చిరునామాకు పంపాలి.
Also Read: Hyderabad News: హైదరాబాద్‌లో రూ.2లక్షల విలువైన గంజాయి పట్టివేత..
టెన్త్ అర్హత ఉన్న అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.19,900 ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.