Longest Railway Station Name In India: భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటిగా కొనసాగుతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ వ్యాప్తంగా వేలాది కిలో మీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ఏడు వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 15 వేలకు పైగా ప్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు కలిపి సుమారు 20 వేల రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడంతో పాటు రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సగటున రోజుకు 2.5 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే ఎన్నో వింతలు, విశేషాలను కలిగి ఉన్నది. వాటిలో ఒకటి దేశంలోనే అతి పొడవైన పేరున్న రైల్వే స్టేషన్. ఇంతకీ ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? దాని పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళనాడులో అతిపొడవైన పేరున్న రైల్వే స్టేషన్
దేశంలోనే అతి పొడవైన పేరున్న రైల్వే స్టేషన్ తమిళనాడులో ఉన్నది. దానిపేరు పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇది దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో పొడవైన పేరును స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే స్టేషన్ పేరు మొత్తం 57 అక్షరాలను కలిగి ఉంటుంది. ఈ స్టేషన్ ను మొదట్లో మద్రాస్ సెంట్రల్ అని పిలిచేవారు. ఆ తర్వాత చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు. 2019లో తమిళనాడు AIADMK ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి MG రామచంద్రన్ గౌరవార్థం స్టేషన్ పేరు మార్చాలని కేంద్రాని సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరును పురచ్చి తలైవర్ డాక్టర్ MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ గా మార్చారు. ఈ రైల్వే స్టేషన్ ముంబై, ఢిల్లీ, కోల్ కతాతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాలతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను రైల్వే కనెక్టివిటీని పెంచుతుంది.
రామచంద్రన్ రైల్వే స్టేషన్ NSG-1 కేటగిరీ హోదా
పురచ్చి తలైవర్ డాక్టర్ MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ దక్షిణ రైల్వే జోన్ లోని చెన్నై డివిజన్ కింద NSG-1 కేటగిరీ హోదాను కలిగి ఉంది. అధిక ప్రయాణీకుల రద్దీ, ప్రాముఖ్యత కలిగిన రైల్వే స్టేషన్ కావడంతో ఈ ప్రతిష్టాత్మక హోదాను అందించారు. చెన్నైలో ప్రాథమిక టెర్మినస్ గా పని ఈ రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతున్నది. ఇక్కడి నుంచి ప్రాంతీయ, సుదూర ప్రాంత రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. ఈ రైల్వే స్టేషన్ ను ఆర్కిటెక్ట్ జార్జ్ హార్డింగ్ రూపొందించారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగి ఉంది. దేశంలోనే అతి పొడవైన సింగిల్ వర్డ్ రైల్వే స్టేషన్‌గా ఆంధ్రప్రదేశ్ లోని వెంకటనరసింహరాజువారిపేట రైల్వే స్టేషన్ గుర్తింపు తెచ్చుకుంది.
'Venkatanarasimharajuvaripeta' #RailwayStation on the #TamilNadu – #AndhraPradesh border has the longest single-word name for a railway station in #India. The station, whose name has 28 letters. The longest name is #Chennai's PuratchiThalaivarDrM.G.Ramachandran Central Station. pic.twitter.com/HajtkCZSeL
— Ch.M.NAIDU (@chmnaidu) August 24, 2024
Read Also: ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాలు, టాప్ 10లో భారత్ ఏ ప్లేస్ లో ఉందంటే?