BigTV English
Advertisement

Chandoo Mondeti: రక్తపు వాంతులు.. చేతులతో చేపల కూర వడ్డిస్తే చైతన్య ఏం చేశాడంటే.. ?

Chandoo Mondeti: రక్తపు వాంతులు.. చేతులతో చేపల కూర వడ్డిస్తే చైతన్య ఏం చేశాడంటే.. ?

Chandoo Mondeti: ఒక సినిమ కోసం హీరోలు ఎంత కష్టపడతారు అనేది చాలా తక్కువమందికి తెలుస్తుంది. స్టార్ హీరోల సినిమాలు అంటే ఎక్కువ కష్టం ఉండదు.. సెట్స్ వేస్తారు.. డూప్స్ ని పెడతారు. అంతా ఏసీలోనే చేస్తారు అనేది పొరపాటు. పాత్రకు తగ్గట్టు మేకోవర్ మార్చడం నుంచి ఆ పాత్ర పండడానికి ఎంకైనా  తెగిస్తారు. తాజాగా అక్కినేని నాగ చైతన్య.. తండేల్ సినిమా కోసం ప్రాణాలు పెట్టేశాడని డైరెక్టర్ చందూ మొండేటి చెప్పుకొచ్చాడు. చై, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తండేల్.  బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన  చిత్రబృందం  వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంది. తాజాగా డైరెక్టర్ చందూ మొండేటి ఒక ఇంటర్వ్యూలో తండేల్ కోసం నాగచైతన్య పడిన కష్టం గురించి చెప్పుకొచ్చాడు. “ఈ సినిమా కోసం చై కష్టపడిన తీరు  నన్నే ఆశ్చర్యపరిచింది. మొదట ఈ సినిమాకు చైను అనుకుంటున్నట్లు బన్నీవాసుకు చెప్తే ఏం మాట్లాడుతున్నావ్.. ఆయన ఫేస్, కాళ్లు చూసావా.. అని అడిగారు. చై మాత్రం తనకు ఈ కథ నచ్చిందని చెప్పాడు.

శ్రీకాకుళం  వెళ్లి అక్కడ అంతా నేర్చుకున్నాం.  మత్స్యకారులు ఎలా కూర్చుంటారు.. ? ఎలా నడుస్తారు .. ? ఏం భోజనం తింటారు.. ? ఇలా అన్ని తెలుసుకున్నాం. శ్రీకాకుళంలో మేము అందరం 20 మంది వెళ్లాము. అక్కడ  మాకు భోజనం పెట్టడానికి ఒక టేబుల్ లాంటింది వేశారు. అక్కడ ఉన్నవారందరూ.. మేము వడ్డిస్తామంటే.. మేము వడ్డిస్తామని పోటీ పడ్డారు. అందులో ఒక పెద్దవిడా.. చేపల కూరను చేత్తో వడ్డించింది. నాకు భయం వేసింది.


Allu Arjun: 280 కోట్ల డీల్ రా.. హీరో అయ్యి ఉండి ఆ మాత్రం కూడా చేయడా.. ?

చైతన్య లాంటి హీరో ఏది తింటాడు.. ? హైజీన్ గా ఆలోచిస్తాడు అని కంగారుపడ్డాను. అక్కడ తింటున్న కొంతమంది.. ఆమె వడ్డిస్తుంటే తమకు వద్దని ముఖం తిప్పుకున్నారు. కానీ, చై మాత్రం ఆ కూరను కూడా తినేశాడు. అంటే.. అక్కడ కెమెరాలు ఉన్నాయని కాదు.. అతని నేచర్ అలాంటింది. ఇలా ప్రతి విషయంలో చై ఎంతో కష్టపడ్డాడు. ముఖ్యంగా బోట్ లో సీన్స్ కు అయితే ప్రాణాలు పోతాయేమో అనిపించింది. సాధారణంగా ఇలాంటివి సెట్స్  వేస్తారు.

నేను కూడా సెట్ వేస్తామని చెప్తే  చై మాత్రం.. వద్దు సముద్రంలోనే చేద్దాం. ఒక మూడు రోజులు చేద్దాం. సెట్ అవ్వలేదంటే సెట్ వేద్దాం.. అక్కడ ఒరిజినల్ గా చేయడానికి అయినా అనుభవం ఉంటుంది కదా అన్నాడు. అలాగే అని సముద్రంలోనే కొన్ని సీన్స్ షూట్ చేసాం. పైన  ఎండ.. సముద్రం లో నుంచి వచ్చే గాలి ముఖానికి గట్టిగ తగులుతుంటుంది. బోట్  40 డిగ్రీల యాంగిల్ లో అటుఇటు ఊగుతుంటుంది. ఒక సీన్ అవ్వగానే సెట్ లో ఉన్నవారందరికి రక్తపు వాంతులు.

నేను, చై తప్ప మిగిలినవారందరూ వాంతులు చేసుకున్నారు. లోపల పేగులు కదిలివచ్చేయేమో అన్నంతగా వాంతులు చేసుకున్నారు. అప్పుడుబన్నీవాసుకు సెట్ వేద్దాం అని అన్నాను. ఆయన కూడా ఓకే నీ ఇష్టం అన్నారు. కానీ, చై మాత్రం పర్వాలేదు చేద్దాం అని చెప్పుకొచ్చాడు. అంత కసితో చై ఈ సినిమా చేశాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి చై పడిన కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×