BigTV English

Hyderabad News: హైదరాబాద్‌లో రూ.2లక్షల విలువైన గంజాయి పట్టివేత..

Hyderabad News: హైదరాబాద్‌లో రూ.2లక్షల విలువైన గంజాయి పట్టివేత..

Hyderabad News: ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నప్పటికీ హైదరాబాద్ మహా నగరంలో గంజాయి మత్తు ముంచెస్తోంది. ఎప్పుడు ఎక్కడో ఓ చోట గంజాయి ముఠా పట్టుబడుతోంది. రోజురోజుకూ గంజాయి వాడకం పెరిగిపోతుంది. జీహెచ్ఎంసీలో ఎక్కడపడితే అక్కడ గంజాయి, డ్రగ్స్, విచ్చలవిడిగా దొరికేస్తోంది. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మత్తుగాళ్ల ఆగడాలు మాత్రం ఆడగం లేదు. ఇప్పుడితే నగరవాసులకు, శివారు ప్రాంతంలో నివసిస్తున్న వారికి, పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.


మత్తులో ఉండడం వాళ్లే రోడ్లపై గొడవలు పడుతూ.. దాడులకు దిగే అవకాశం ఉంది. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడూ గంజాయి ముఠాలను అరెస్ట్ చేయాలని నగరవాసులు కోరుతున్నారు. నగరానికి గంజాయి సరఫరా అవ్వకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులకు ఉంటుందని అన్నారు. అయితే ఎంత  కట్టుదిట్టం చేసినప్పటికీ ఎక్కడో ఓ చోటు గంజాయి ముఠాలు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ నిందితుడి నుంచి  పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో అక్రమంగా గంజాయి చాక్లెట్లను తరలిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్, కూకట్ పల్లికి అక్రమంగా తరలిస్తున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని గోరక్ సహాగా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.


గోరక్ సాహా అనే వ్యక్తి కొన్ని రోజులుగా కూకట్‌పల్లిలోని ఓ వసతి గృహంలో ఉంటున్నాడు. అక్కడ ఓ టీకొట్టు ఏర్పాటు చేసి అందులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  వివరాల ప్రకారం.. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు ట్రైన్‌లో గంజాయి చాక్లెట్లను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సమాచారం మేరకు పోలీసులు గోరక్ సహా వద్ద 24 కేజీల గంజాయి చాక్లెట్ల ప్యాకెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడి వద్ద మొత్తం 120 గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఒక్కొక్క గంజాయి ప్యాకెట్‌లో 40 చాక్లెట్లు ఉన్నట్లుగా పోలీస్ అధికారులు గుర్తించారు. కూకట్ పల్లి టీ కొట్టులో ఒక్కొక్క చాక్లెట్‌ను రూ.40 చొప్పున విక్రయిస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. మొత్ంతం గంజాయి చాక్లెట్ల విలువ దాదాపు రూ.2లక్షల విలువ ఉంటుందని అంచనా వేశారు. నిందితుడితో పాటు చాక్లెట్లను సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. గంజాయి చాక్లెట్లను పట్టుకున్నవారిలో సీఐలు చంద్రశేఖర్‌, బిక్షారెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు, తదితర సిబ్బంది ఉన్నారు. గంజాయి చాక్లెట్లను పట్టుకున్న ఎస్టీఎప్‌ టీమ్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌ రెడ్డి అభినందించారు.

Also Read: Telangana Assembly: ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

హైదరాబాద్ మహానగరంలో గంజాయి వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులకు ఎంతైనా ఉంది. నగరంలో గంజాయి సరఫరా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భాగ్య నగర వాసులు పోలీసులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గంజాయి విక్రయించే వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి ఆగడాలు పునరావృతం కాకుండా ఉంటాయని నెటిజన్లు అంటున్నారు.

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×