Staff Nurse Recruitment: తూర్పుగోదావరి జిల్లాలో ఎంబీబీఎస్, ఎండీ(జనరల్ మెడిసిన్), డిప్లొమా(జీఎన్ఎం) పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉమ్మడి జిల్లాలోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం- కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగం పొందిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉంటే వెంటనే ఉద్యోగానికి అప్లై చేసుకోండి.
జిల్లాలో మొత్తం ఉద్యోగాల సంఖ్య: 04
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జనరల్ ఫిజీషియన్/ మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
జనరల్ ఫిజీషియన్/ మెడికల్ ఆఫీసర్ 1 పోస్టు, స్టాఫ్ నర్సు 3 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఎండీ(జనరల్ మెడిసిన్), డిప్లొమా(జీఎన్ఎం) పాసై ఉండాలి.
వయస్సు: 42 ఏళ్లు మించరాదు
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను డీఎంహెచ్ఓ కార్యాలయం, కేశవరం రోడ్, బొమ్మూరు, రాజమహేంద్రవరం చిరునామాకి పంపాలి.
Also Read: ITBP Jobs: ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. త్వరపడండి..
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 4
జిల్లా అఫీషియల్ వెబ్ సైట్: https://eastgodavari.ap.gov.in/notice_category/recruitment/