E-Paper
Advertisement

ITBP Jobs: ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. త్వరపడండి..

ITBP Jobs: ఐటీబీపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. త్వరపడండి..
Advertisement

ITBP Jobs: నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశమనే చెప్పవచ్చు. గ్రూప్-సీ నాన్- గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) విభాగంలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 22వ తేదీలోగా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 51

Advertisement

మోటార్ మెకానిక్ విభాగంలోనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో హెడ్ కానిస్టేబుల్ 7 ఉద్యోగాలు, కానిస్టేబుల్ 44 ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యార్హత: కానిస్టేబుల్ పోస్టులకు అయితే టెన్త్ క్లాస్, ఐటీఐ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అయితే ఇంటర్ పాసై ఉండాలి. అలాగే మోటార్ మెకానిక్ సర్టిఫికెట్/డిప్లొమా(ఆటో మొబైల్ ఇంజినీరింగ్) పాసై ఉండాలి.

Advertisement

వయస్సు: 2025 జనవరి 2 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉండాలి.

జీతం: కానిస్టేబుల్ ఉద్యోగాలకు రూ.21,700- రూ.69,100 ఉండగా.. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు రూ.25,500 నుంచి రూ.81100 గా ఉంది.

ఎంపిక విధానం: ఎంపిక విధానానికి సంబంధించి ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాతపరీక్ష, ప్రాక్టికల్(స్కిల్) టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2024 డిసెంబర్ 24
దరఖాస్తుకు చివరి తేది: 2024 జనవరి 22.

అఫీషియల్ వెబ్ సైట్: https://recruitment.itbpolice.nic.in/rect/index.php

Also Read: New India Assurance: మీరు డిగ్రీ పాసైతే చాలు.. ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు..

గ్రూప్-సీ విభాగంలో పోలీస్ ఉద్యోగం సాధించాలనే తపన ఉన్నవారికి ఇదైతే మంచి అవకాశం. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి అప్లై చేసుకోండి . ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×