Vidaa Muyarchi : అజిత్ (Ajith) సినిమా ‘విడా ముయార్చి’ (Vidaa Muyarchi) రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ వీడకపోవడంతో, అసలు సంక్రాంతి రేసులో ఈ సినిమా ఉన్నట్టా లేనట్టా? అనే డైలమాలో ఉన్నారు అజిత్ అభిమానులు. 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నాం అనే విషయాన్ని వెల్లడించిన ఈ మూవీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, సంక్రాంతికి పట్టుమని 10 రోజు కూడా లేకపోయినా ప్రమోషన్స్ షురూ చేయకపోవడం కొత్త అనుమానాలకు తెర తీసింది.
తమిళ సీనియర్ హీరో అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘విడా ముయార్చి’ (Vidaa Muyarchi). ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘విడా ముయార్చి’ మూవీలో అర్జున్, రెజినా, సంజయ్ దత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా ఈ మూవీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వకపోవడంతో, అజిత్ అభిమానులు అయోమయంలో పడ్డారు.
రీసెంట్ గా ‘విడా ముయార్చి’ (Vidaa Muyarchi) మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, అందులోని యాక్షన్ సీన్స్ అన్ని విషయాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ చివర్లో 2025 జనవరిలో పొంగల్ కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటిదాకా ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు జనవరి 10న ఈ మూవీ తాత్కాలిక రిలీజ్ డేట్ గా ప్రకటించగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.
అయితే ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీ పనులు ఇంకా పెండింగ్ లో ఉండడంతో డెడ్ లైన్ ను రీచ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన పెండింగ్ వర్క్ చాలా ఉండడంతో సినిమా లేట్ అవుతుందని అంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఈ సినిమాకు వచ్చిన లీగల్ ఇష్యూస్ కారణంగా సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం లేదని అంటున్నారు. ఈ మూవీ టీం మాత్రం రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఇక ఈ సినిమాకు వచ్చిన లీగల్ ఇష్యూస్ ఏంటంటే… ‘విడా ముయార్చి’ టీజర్ రిలీజ్ అయ్యాక రెండు రోజులకే, తమ దగ్గర ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ‘బ్రేక్ డౌన్’ అనే సినిమాను కాపీ కొట్టారంటూ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ పారామౌంట్ సీరియస్ అవుతూ లీగల్ చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు తమ సినిమాను కాపీ చేసినందుకుగాను 150 కోట్లు చెల్లించాలంటూ సదరు హాలీవుడ్ నిర్మాతలు డిమాండ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. మరి నిజంగానే ఈ సినిమా లీగల్ ట్రబుల్స్ కారణంగా వాయిదా పడిందా? లేదంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదా? ఈ రెండు కాదంటే టాలీవుడ్ లో సరైన రిలీజ్ డేట్ దొరకకపోవడమే కారణమా ? అనేది తెలియాల్సి ఉంది.