Bollywood: సినిమా ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది సెలబ్రెటీస్ “దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అన్న తీరులో.. అవకాశాలు చేతినిండా ఉన్నప్పుడే డబ్బు కూడబెట్టుకుంటూ ఉంటారు. అలా తమ సంపాదనతో వచ్చే పెద్ద మొత్తంలో డబ్బుని రియల్ ఎస్టేట్ రంగంలో, బిజినెస్ రంగంలో పెట్టుబడిగా పెడుతూ ఉంటారు. ఇక మన సౌత్ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలకు ఇప్పుడిప్పుడే ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు.కానీ బాలీవుడ్ లో ఉండే సెలబ్రిటీలకు ముందు నుండి ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తూ ఉంటారు. వాళ్ల రెమ్యూనరేషన్ గతంలోనే కోట్లలో ఉండేది. ఇక ఇప్పుడైతే మరీ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక బాలీవుడ్ టాప్ సెలబ్రిటీల రెమ్యూనరేషన్స్ అయితే చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఉండే ఓ ఐదుగురు సెలబ్రిటీలు ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
దీపికా పదుకొనే:
అందం, అభినయంతో వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్లలో ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉంది హీరోయిన్ దీపిక పదుకొనే (Deepika Padukone). ఈ ముద్దుగుమ్మ తన అందంతో వరుస అవకాశాలను అందుకోవడమే కాదు ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా సంపాదిస్తోంది. అలా ఈ ఏడాది దీపిక పదుకొనే కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా యాడ్స్ ద్వారా కూడా కోట్లు సంపాదించింది. ఇక ఈ ఏడాది దీపికా రణ్ వీర్ సింగ్ ల జీవితంలో మర్చిపోలేని ఏడాది. ఎందుకంటే ఈ జంటకు ఒక పాప పుట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీపిక పదుకొనే ఈ ఏడాది తను సంపాదించిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అదేంటంటే ఈ ఏడాది దీపికా పదుకొనే ముంబైలోని బాంద్రా వెస్ట్ ఏరియాలో ఏకంగా రూ.17.8 కోట్లు ఖర్చుపెట్టి ఒక పెద్ద అపార్ట్మెంట్ ని కొనుగోలు చేసింది. అలా తను సంపాదించిన డబ్బుని ఆ విధంగా ఖర్చు పెట్టింది. ఇక ఈ ఏడాది దీపిక ఖాతాలో ‘కల్కి’ వంటి భారీ పాన్ ఇండియా మూవీ పడిన సంగతి మనకు తెలిసిందే. కల్కి సీక్వెల్ లో కూడా దీపిక పదుకొనే హీరోయిన్గా చేస్తోంది.
అమీర్ ఖాన్:
ఈ హీరో చేసిన సినిమాలు ఇప్పుడు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.కానీ ఒకప్పుడు ఈయన స్టార్ హీరో..ఈయన చేసిన ‘దంగల్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే అలాంటి అమీర్ ఖాన్ (Aamir Khan)ఈ ఏడాది నటించిన ఏ సినిమా కూడా ఆశించిన మేర ఫలితాన్ని అందించలేదు. అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ డబ్బులు మాత్రం బాగానే సంపాదించారు. అలాగే అమీర్ ఖాన్ ఈ ఏడాది సంపాదించిన డబ్బుతో దాదాపు తొమ్మిది కోట్లు పెట్టి ముంబై బాంద్రాలోని పాలిహిల్ లో ఉండే బెల్లా విస్టా లోని ఒక పెద్ద అపార్ట్మెంట్ ని కొనుగోలు చేశారు.
అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్:
ఈ ఏడాది బాలీవుడ్ సెలబ్రిటీల అందరికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన హీరోలలో మొదటి ప్లేస్ లో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)లు ఉన్నారు. ఎందుకంటే వీరిద్దరూ కలిసి దాదాపు రూ.100 కోట్ల వరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ రూ.70 కోట్లు పెట్టుబడి పెట్టగా.. అభిషేక్ బచ్చన్ రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ఇలా ఈ ఏడాది అత్యధిక పెట్టుబడి పెట్టిన హీరోలుగా బచ్చన్ ఫ్యామిలీ నిలిచిందని చెప్పుకోవచ్చు.
త్రిప్తి డిమ్రీ:
గత ఏడాది యానిమల్ మూవీ తో ఓవర్ నైట్ లో నేషనల్ క్రష్ గా మారిపోయిన ‘త్రిప్తి డిమ్రీ’ ఈ ఏడాది వరుస హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. త్రిప్తి డిమ్రీ నటించిన బ్యాడ్ న్యూజ్, భూల్ భూలయ్యా -3 వంటి రెండు సినిమాలు అతిపెద్ద హిట్ కొట్టాయి. దీంతో త్రిప్తి డిమ్రీ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే త్రిప్తి ఈ ఏడాది తను సంపాదించిన డబ్బుతో దాదాపు రూ.14 కోట్లు పెట్టి ముంబై బాంద్రాలోని వెస్ట్ ప్రాంతంలో కార్టర్ రోడ్డు లో ఒక లగ్జరీ బంగ్లాని కొనుగోలు చేసింది. అలా ఈ ఏడాది త్రిప్తి డబ్బులు సంపాదించడమే కాదు వాటిని ఉపయోగించి ఓ లగ్జరీ బిల్డింగ్ ని కూడా కొన్నది.
షాహిద్ కపూర్:
టాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ(Vijay deverakonda) ఎంత ఫేమస్ అయ్యారో.. ఈ సినిమాని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ గా రీమేక్ చేసి షాహిద్ కపూర్ (Shahid Kapoor)కూడా అంతే ఫేమస్ అయ్యారు. అయితే ఈ ఏడాది షాహిద్ కపూర్ దాదాపు రూ.85 కోట్లు ఖర్చు పెట్టి సీ వ్యూ అపార్ట్మెంట్ కొనుగోలు చేసి వార్తలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సీ వ్యూ అపార్ట్మెంట్ వర్లీ లోని ఒబెరాయ్ 3-6 వెస్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అలా ఈ ఏడాది బాలీవుడ్ సెలబ్రిటీలందరూ తాము సంపాదించిన డబ్బులతో రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టి వార్తల్లో నిలిచారు.