E-Paper
Advertisement

Best Jobs: ఇక ఇంజనీరింగ్ చదవడం వేస్ట్, ఇకపై ఈ ఉద్యోగాలకే భారీ జీతాలు

Best Jobs: ఇక ఇంజనీరింగ్ చదవడం వేస్ట్, ఇకపై ఈ ఉద్యోగాలకే భారీ జీతాలు
Advertisement

భారతదేశంలో మంచి కెరీర్ అంటే ఇప్పటివరకు చాలా మంది యువతకు ఐటీ లేదా ఇంజనీరింగ్ రంగాలే గుర్తుకు వచ్చేవి. ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పొందడం పెద్ద కలగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతోంది. 2026 నాటికి ఉద్యోగాలలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. ఐటీ రంగంలో లేఆఫ్స్, ఆటోమేషన్, కృత్రిమ మేధ (AI) ప్రభావం పెరగడంతో యువత ఇప్పుడు వేరే కెరీర్ మార్గాలను వెతుక్కోవాల్సిన స్థితి వచ్చింది. ఇకపై ఇంజినీరింగ్ చదివే కన్నా ఇక్కడ చెప్పిన రంగాల్లో అడుగుపెడితే భారీ జీతాలు అందుకునే అవకాశం ఉంటుంది.

హెల్త్‌కేర్ రంగం
అత్యధిక డిమాండ్ ఉన్న రంగాలలో హెల్త్‌కేర్ మొదటి స్థానంలో ఉంది. కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీనివల్ల ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, వెల్‌నెస్ సెంటర్లు పెరుగుతున్నాయి. దీని వల్ల వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, హెల్త్ మేనేజ్‌మెంట్ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రత్యేకంగా చర్మ వైద్యులు, కాస్మొటిక్ వైద్యులు ఎక్కువగా అవసరమవుతున్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా స్కిన్ కేర్, హెయిర్ కేర్, కాస్మెటిక్ చికిత్సలపై ఖర్చు చేయడానికి ముందుకు రావడం ఈ డిమాండ్‌కు కారణంగా నిపుణులు చెబుతున్నారు. పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా హెల్త్‌కేర్ సేవలు విస్తరిస్తుండటం ఈ రంగాన్ని స్థిరమైన కెరీర్‌గా మార్చుతోంది.

Advertisement

నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగం
దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. కొత్త హైవేలు, విమానాశ్రయాలు, మెట్రో ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. దీంతో సివిల్ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆర్కిటెక్టులు, కన్‌స్ట్రక్షన్ సూపర్‌వైజర్లకు భారీగా అవకాశాలు వస్తున్నాయి. ప్రభుత్వం, ప్రైవేట్ రంగాలు కలిసి పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ప్రాజెక్ట్ అమలు సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం, సమయపాలన ఉన్నవారికి మంచి జీతాలు, మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీనివల్ల నిర్మాణ రంగాన్ని ఎంచుకోవడం మంచిదే.

Also read: Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో

Advertisement

మేనేజ్మెంట్ రంగం
సంస్థలు పెరగడంతో మార్కెట్ పోటీ పెరుగుతోంది. దీనివల్ల కంపెనీలు అనుభవం ఉన్న నాయకులను కోరుకుంటున్నాయి. ఫైనాన్స్, మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్ రంగాలలో నాయకత్వ బాధ్యతలు చేపట్టగల వ్యక్తులకు మంచి అవకాశాలు ఉన్నాయి. సంస్థను లాభదాయకంగా నడిపించడం, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడం, టీమ్‌ను ప్రోత్సహించడం వంటి సామర్థ్యాలు ఉన్నవారికి అధిక జీతాలు ఆఫర్ అవుతున్నాయి. అందుకే మేనేజ్‌మెంట్ నైపుణ్యాలకు విలువ పెరుగుతోంది.

క్రియేటివ్ ఫీల్డ్ ఉద్యోగాలు
AI టచ్ చేయలేని ఉద్యోగాలు ఇవన్నీ. ఇంటీరియర్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, ట్రావెల్ ప్లానింగ్ వంటి రంగాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రజలు ఇప్పుడు వస్తువుల కంటే అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి డెకరేషన్, ట్రావెల్ ప్లానింగ్, వ్యక్తిగత బ్రాండింగ్ వంటి సేవలకు డిమాండ్ పెరగడం ఈ ఉద్యోగాలలో భారీగా సంపాదించవచ్చు.

Also read: Hill Station: మనదేశంలోనే అత్యంత ప్రశాంతమైన హిల్ స్టేషన్ ఇది, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

ఐటీ రంగం పరిస్థితి ఏమిటి?
ఐటీ రంగం పూర్తిగా పడిపోయిందని చెప్పలేము. కానీ గతంలో ఉన్నంత వేగంగా ఉద్యోగాలు పెరగడం లేదు. ఆటోమేషన్, AI టూల్స్ వల్ల కొన్ని రొటీన్ పనులు తగ్గాయి. కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పనిని పూర్తి చేయగలుగుతున్నాయి. దీంతో యువత ఐటీతో పాటు ఇతర రంగాలపై కూడా దృష్టి పెట్టడం మంచిది. రాబోయే కాలంలో డిగ్రీ కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యం ఉంటుంది. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్, టీమ్‌వర్క్, డిజిటల్ నైపుణ్యాలు, సృజనాత్మకత వంటి లక్షణాలు ఉద్యోగాల్లో కీలకంగా మారుతున్నాయి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×