Supreme Court: దేశవ్యాప్తంగా ఈనెల 21 నీట్ యూజీ రీ-ఎగ్జామ్ జరగనుంది. ఈ పరీక్షను నిలిపివేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. దీంతో ఆ పరీక్ష అనుకున్న తేదీకి జరగనుంది. అసలు కోర్టులో ఏం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్తొద్దాం.
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు లైన్ క్లియర్
జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ రీఎగ్జామ్ జరగనుంది. అయితే ఈ పరీక్షను నిలిపివేయాలని పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలంటూ అభ్యర్థుల తరపు న్యాయవాదులు కోరారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసి పుచ్చింది.
నీట్ పరీక్షకు సంబంధించిన అన్ని పిటిషన్లను జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందుకు ఉన్నాయని, ఈ పిటిషన్లను కూడా ఆ ధర్మాసనం విచారిస్తుందని పేర్కొంది. అదే సమయంలో అభ్యర్థుల తరపు న్యాయవాదులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. సోషల్సా మీడియాలో లీకేజీ రూమర్ల కారణంగా 1600 మంది విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాదులు.
సుప్రీంకోర్టు నిరాకరణ, జూన్ 21న పరీక్ష యథాతథం
జూన్ 21న జరగనున్న పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో అనేక సమస్యలు వాదించారు. విద్యార్థులకు అస్సలు సమయం ఉండలేదని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించారు.
మరోవైపు నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు హాజరవుతున్న విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది.పరీక్షకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని వేగంగా అందించేందుకు అధికారిక వాట్సాప్ ఛానల్ ను ప్రారంభించింది ఎన్టీఏ. నీట్ రీ-టెస్ట్ నేపథ్యంలో తప్పుడు వార్తలు, తప్పుడు సందేశాలు వ్యాపిస్తుండటంతో విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకు వేగంగా అడుగులు వేసింది.
ALSO READ: ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు.. ఫస్టియర్ విద్యార్థులదే హవా
విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారికంగా వచ్చే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. వాట్సాప్ ఛానల్ ద్వారా నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి అడ్మిట్ కార్డ్‌లు, పరీక్షా కేంద్రాల వివరాలు, విద్యార్థులు నేరుగా తమ మొబైల్‌లో చూడొచ్చు.