E-Paper

Nalgonda Tour: నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!

Nalgonda Tour: నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.13 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
Advertisement

Nalgonda Tour: స్వేచ్చబ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.

రూ. 13 వేల కోట్లు..

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జిల్లాకు సంబంధించిన పలు కీలకమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ. 13 వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ‘హ్యాం రోడ్ల’ నిర్మాణ పనులకు నల్లగొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పునాది వేయనున్నారు.అంతేగాక నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేసే కీలకమైన ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రాజెక్టును 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.

Advertisement

Also Read: వారెవ్వా వందే భారత్.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయాణం అంటూ విదేశీ యువతుల ప్రశంసలు!

సుమారు లక్ష మంది..

ఈ సభ ద్వారా జిల్లా సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ​ఈ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుండి సుమారు లక్ష మందికి పైగా ప్రజలను, పార్టీ కార్యకర్తలను సమీకరించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సభకు వచ్చే ప్రజలకు, వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు , పోలీస్ శాఖను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు.

Advertisement

Also Read: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. స్టార్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు!

Related News

Jana Sena: తెలంగాణ లీడర్లకు జనసేన గాలం.. అలాంటి నేతలే టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహం!

తెలంగాణలో జనసేన 2.0.. మణికొండలో పార్టీ ఆఫీసు, అక్కడి నుంచే వ్యూహరచన

తెలంగాణలో భానుడి ప్రతాపం.. ఆ తర్వాత హైదరాబాద్, సాయంత్రం ఆ జిల్లాలకు అలర్ట్

హైదరాబాద్‌లో డేంజరస్ గ్యాంగ్.. గల్లీల్లో అండర్‌గ్రౌండ్ WWE ఫైట్లు, రక్తం ఒలికేలా కొట్టుకుంటూ..!

Harish Rao: తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ పై.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్..!

Lake Restoration: మరో చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చిన హైడ్రా..!

Farmer Exploitation: దమ్ముంటే విచారణ జరపండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవన్ రెడ్డి చాలెంజ్!

Big Stories

×