BigTV English

Technician Jobs: HMFW తిరుపతిలో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. జస్ట్ అప్లై చేస్తే చాలు..!

Technician Jobs: HMFW తిరుపతిలో ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. జస్ట్ అప్లై చేస్తే చాలు..!

Technician Jobs: డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఏపీ, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ (HMFW) తిరుపతిలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లోదరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం సాధించిన అభ్యర్థులు సొంత రాష్ట్రంలో జాబ్ చేసుకోవచ్చు.


ఏపీ, హెల్త్‌ మెడికల్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ (HMFW), తిరుపతి.. కాంట్రాక్ట్ విధానంలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, టెక్నీషియన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష్ విడుదల అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 22 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలన చూద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 66


ఏపీ, హెల్త్‌ మెడికల్‌ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ (HMFW), తిరుపతిలో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, నర్సింగ్ ఆర్డిర్లీ (ఫిమేల్/మేల్), ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, అటెండర్లు, ఫజియో థెరపిస్ట్, మార్చురీ మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పలు విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఓటీ, సీ – ఆర్మ్‌, డయాలసిస్‌, అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడికల్‌, ఈఈజీ, ఆడియోమెట్రీ తదితర విభాగాల్లో వెకెన్సీ ఉన్నాయి.

పోస్టు పేరు అండ్ ఖాళీల వారీగా.. 

ల్యాబ్‌ అటెండెంట్: 07

జనరల్‌ డ్యూటీ అంటెండెంట్: 15

లైబ్రేరీ అటెండెంట్: 01

టెక్నీషియన్‌: 13

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 03

నర్సింగ్‌ ఆర్డర్లీ (ఫిమేల్‌ /మేల్‌): 17

ఆపరేషన్ థియేటర్‌ అసిస్టెంట్: 02

ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌: 01

అటెండర్లు: 04

ఫిజియోథెరపిస్ట్‌: 02

మార్చురీ మెకానిక్‌: 01

విద్యార్హత: టెన్త్ క్లాస్, ఇంటర్ పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 42 ఏళ్ల వయస్సు మించరాదు. ఓబీసీ మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.15వేల నుంచి రూ.32,670 వరకు వేతనం ఉంటుంది.

వర్క్ లోకేషన్: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలోని ఎస్‌వీ మెడికల్ కాలేజ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌ గవర్నమెంట్‌ హస్పిటల్‌, గవర్నమెంట్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, ఎస్‌వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, శ్రీ పద్మావతి గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, గవర్నమెంట్‌ మెటర్నిటీ హస్పిటల్‌లలో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది.  ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

Also Read: Delhi Elections: 26 ఏళ్ల తర్వాత హస్తినాలో రెపరెపలాడిన కాషాయ జెండా.. కేజ్రీవాల్ ఓటమికి కారణం ఇదేనా..?

ఉద్యోగ దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

అఫీషియల్ వెబ్ సైట్: https://tirupati.ap.gov.in/

ముఖ్యమైన డేట్స్:

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 22

ప్రొవిజన్ మెరిట్ జాబితా తేది: 2025 మార్చి 7

అభ్యంతరాలకు చివరి తేది: 2025 మార్చి 12

తుది మెరిట్ జాబితా: 2025 మార్చి 15

సర్టిఫికెట్ వెరిఫికేషన్, నియామక ఉత్తర్వులు: 2025 మార్చి 24

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×