BigTV English

Tollywood: యూట్యూబర్ పై రూ. 2 కోట్లు దావా వేసిన తండ్రీకొడుకులు.. అంత పగబట్టిన స్టార్స్ ఎవరు.. ?

Tollywood: యూట్యూబర్ పై రూ. 2 కోట్లు దావా వేసిన తండ్రీకొడుకులు.. అంత పగబట్టిన స్టార్స్ ఎవరు.. ?

Tollywood: సోషల్ మీడియా వచ్చాకా .. సెలబ్రిటీలు  ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది ఇట్టే తెలిసిపోతుంది. వారు ఎక్కడ ఉంటున్నారు.. ? ఏం చేస్తున్నారు.. ? .. ముఖ్యంగా వారి పర్సనల్  విషయాలను కూడా నెటిజన్స్ వదలడం లేదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. సినిమా రిలీజ్ అయ్యాకా.. యూట్యూబ్ లో రివ్యూస్ పేరుతో కొంతమంది యూట్యూబర్లు హీరోస్ పై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయ్యిన గంటలోనే.. యూట్యూబర్లు సినిమాలోని కథ ఇది.. సినిమాలో హీరో అలా చేశాడు. సినిమా అస్సలు బాలేదు. అసలు సినిమా ఇలా తీయకుండా ఉండాల్సింది అని చెప్పుకొచ్చేస్తున్నారు. అంతేకాకుండా ఆ హీరోకు సంబంధించిన ప్రతి విషయాన్నీ.. అంతకు ముందు ఆయన చేసిన సినిమాలు.. హిట్ అయిన సినిమాలు ఏంటి.. ? ప్లాప్స్ ఏంటి.. ? అనేది క్లారిటీగా చెప్పుకొస్తున్నారు.


ఇక వీటితో పాటు  హీరో ఏదైనా ఈవెంట్ లో మాట్లాడినా.. ప్రెస్ మీట్ లో మాట్లాడిన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ.. వారికి కౌంటర్లు ఇవ్వడం ఇప్పుడు యూట్యూబర్స్ కు ట్రెండ్ గా మారిపోయింది.  అయితే ఒక ఫేమస్ యూట్యూబర్ పై ఒక స్టార్ హీరో ఢిల్లీ కోర్టులో కేసు వేయడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో చాలామంది యూట్యూబర్లు ఉన్నా.. ఇతను చాలా ఫేమస్. సినిమాలో ఏది మైనస్.. ఏది ప్లస్ అని ఇట్టే చెప్పేస్తాడు. ఆ హీరో ఎలా నటించాడు.. ఎన్ని కోట్లు సినిమాకు రాబట్టగలడు అనేది కూడా చెప్పుకొస్తాడు. కొన్నిసార్లు ఆయన చెప్పినవి కూడా నిజమయ్యాయి. ఇతని వీడియోలను చాలామంది సెలబ్రిటీలు కూడా వీక్షిస్తారు. అంతెందుకు గతేడాది ఈ యూట్యూబర్ తోనే హీరో విశ్వక్ సేన్ గొడవపడ్డాడు కూడా.

Akkineni Naga Chaitanya: ఈ మాత్రం బుద్ది సమంతకు లేదు.. సింపతీ కోసం డ్రామాలు..?


అయితే తాజాగా సదురు యూట్యూబర్ తండేల్ సినిమా రివ్యూ ఇచ్చేటప్పుడు అతను కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. ” ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయన.. నా మీద ఢిల్లీ హైకోర్టులో ఒక సూట్ వేశారు. వాళ్ళమీద లేనిపోనివి  వేసి మాట్లాడుతున్నాను అని. వాళ్ళ గురించి మాట్లాడకూడదు అని నాకు కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది.  సో.. దాంతో ఆగుతారా  అంటే నాకు తెలియదు. నాపై రూ. 2 కోట్లు పరువు నష్టం దావా వేశారు.

అదంతా పక్కన పెడితే.. ఇంకో రెండు నెలలు తిరక్కుండానే ఆ పెద్దమనిషి నాన్న కూడా నాపై కోర్టులో కేసు వేశాడు. అందులో కూడా కొడుకు ఏదైతే చెప్పాడో.. అదే చెప్పుకొచ్చాడు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. నేను కూడా ఢిల్లీ హైకోర్టులో విచారణకు హాజరై వచ్చాను. నాకు వచ్చిన నోటిస్ లో వారి గురించి మాట్లాడకూడదు అని ఆర్డర్ వచ్చింది. అందుకే నేను ఇప్పుడు వారి గురించి మాట్లాడలేను.  ఆ ఆర్డర్ అయిపోగానే అన్ని విషయాలు మీకు చెప్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Allari Naresh : అల్లరోడి ఫ్లాష్ బ్యాక్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్… ఎవరంటే..?

ఇక ప్రస్తుతం ఈ యూట్యూబర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇలా ఈ యూట్యూబర్ ను ఇబ్బందిపెట్టిన ఆ తండ్రీకొడుకులు ఎవరు.. ? అనే చర్చ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కొందరు మెగా కుటుంబం అని చెప్పుకొస్తున్నారు. గేమ్ ఛేంజర్  రివ్యూ గురించి, చిరంజీవి గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం  వలనే వారు కోర్టుకు వెళ్లారని అంటున్నారు.

ఇంకొందరు అల్లు కుటుంబం అని చెప్పుకొస్తున్నారు. బన్నీపై నెగిటివిటి స్ప్రెడ్ చేస్తున్నాడని బన్నీ, ఆయన తండ్రి అల్లు అరవింద్ కోర్టుకు వెళ్లి ఉంటారని అంటున్నారు. ఇక వీరిద్దరూ కాదు.. అసలు ఈ యూట్యూబర్ ను కోర్టుకు లాగింది మంచు కుటుంబం అని  సాక్ష్యాలతో సహా చెప్పుకొస్తున్నారు ఇంకొందరు. గతంలో మంచు విష్ణు.. యూట్యూబ్ చానెల్స్ పై ఫైర్ అయిన సంగతి తెల్సిందే.

గురించి తప్పుడు సమాచారం ఇచ్చినా.. తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి వారిని కించపర్చిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను మూయించిన విషయం విదితమే. ఇప్పుడు ఈ యూట్యూబర్ పై కూడా వారే  పగబట్టారని చెప్తున్నారు. మరి ఈ మూడు ఫ్యామిలీలలో ఆ తండ్రీకొడుకులు ఎవరు అన్నది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×