Teja Sajja.. యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘ఇంద్ర’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు దక్కించుకున్న ఈయన, ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth varma) దర్శకత్వంలో ‘హనుమాన్’ సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మహేష్ బాబు(Mahesh Babu) మూవీని కూడా వెనక్కి నెట్టి రూ.100కోట్ల క్లబ్లో చేరింది. ఇక ఈ సినిమాలో వర్త్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే క్రేజ్ తో అటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఇటు హీరో తేజ సజ్జా కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
మిరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇక తాజాగా హీరో తేజ సజ్జ ‘మిరాయ్’ (Mirai ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై కూడా అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ సినిమాలో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ గా నటిస్తుండడంతో మరింత ఆసక్తి నెలకొంది అని చెప్పవచ్చు. ఇక కలింగ యుద్ధం తర్వాత యోగిగా మారిన అశోకుడు రాసిన ఒక అపార గ్రంథం కోసం జరిగే పోరాటం.. ఆ గ్రంథాన్ని కాపాడడానికి ఉండే ఒక యోధుడి కథే ఈ మిరాయ్ అని సమాచారం. ఇకపోతే ఈ సినిమాను 2025 ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామని గత ఏడాది ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కాస్త వాయిదా పడినట్లు తెలుస్తోంది . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మిరాయ్ సినిమాని జూలై 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక జూలై నెలనే నిర్మాతలు కూడా ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.
తేజ సజ్జ కెరియర్..
తేజ సజ్జ కెరియర్ విషయానికి వస్తే.. 1998లో ‘చూడాలని ఉంది’ అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక 2019లో ‘ఓ బేబీ’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చాడు. 2021లో వచ్చిన ‘జాంబిరెడ్డి’ సినిమా ద్వారా పూర్తిస్థాయి నటుడిగా మారాడు. 1995 ఆగస్టు 23న జన్మించిన ఈయన చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, భారీ ఇమేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా రాజకుమారుడు, కలిసుందాం రా, సర్దుకుపోదాం రండి, ఆకాశవీధిలో, ప్రేమ సందడి, గంగోత్రి, ఠాగూర్ ఇలా చెప్పుకుంటూ పోతే.. పలు చిత్రాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈయనకు మంచి ఇమేజ్ అందించాయి. మరి మిరాయ్ సినిమాతో తేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.