BigTV English

Delhi Elections: 26 ఏళ్ల తర్వాత హస్తినాలో రెపరెపలాడిన కాషాయ జెండా.. కేజ్రీవాల్ ఓటమికి కారణం ఇదేనా..?

Delhi Elections: 26 ఏళ్ల తర్వాత హస్తినాలో రెపరెపలాడిన కాషాయ జెండా.. కేజ్రీవాల్ ఓటమికి కారణం ఇదేనా..?

Delhi Elections: దేశంలో వరుసగా మూడు సార్లు బీజేపీ అధికారం చేపడుతున్నా.. రాజధాని పీఠం దక్కకపోవడం మోదీ సర్కార్ కు కొంత వెలితిగా ఉండేది. కానీ ఇప్పుడు పటిష్టమైన వ్యుహాలతో.. ఆ కోరికను కూడా బీజేపీ నెరవేర్చుకుంది. ప్రజలకు మంచి హామీలు ఇవ్వడంతో పాటు.. అద్భుతమైన రాజకీయ వ్యుహాలతో ఆప్ కంచుకోటను బద్దలు కొట్టిన బీజేపీ హస్తినాలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఆప్ లో కీలక నేతలను ఓడించి.. ఆ పార్టీకి గట్టి దెబ్బ కొట్టింది.


2012 నవంబర్ లో ఏర్పడిన ఆమ్ అద్మీ పార్టీ.. 2013లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 28 సీట్లు సాధించింది. 8 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2015 ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కనీవినీ ఎరగని రీతిలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 67 సీట్లు సాధించి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం 2023 ఏప్రిల్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ పార్టీ హోదాను కూడా ప్రకటించింది. 2020 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ 62 స్థానాలను గెలుచుకుని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో 20 నుంచి 23 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హమీలు అమలు చేయకపోవడం, ఎయిర్ క్వాలిటీపై ప్రజల అసంతృప్తి, సీఎం అధికార నివాసం శేష్ మహల్ ను రూ.33.66 కోట్లతో అభివృద్ధి చేసుకోవడంపై ఆరోపణలు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపై బీజేపీ ప్రచారం, లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు జైలుకెళ్లడంతో పాటు పాలన గాడి తప్పిందని ప్రజలు భావించినట్లు తెలుస్తోంది. ఇవ్వన్నీ కారణాలు పార్టీని అధికారం నుంచి దూరం చేశాయి.

దాదాపు 26 ఏళ్ల తర్వాత రాజధానిని బీజేపీ కైవసం చేసుకున్నది. ఎగ్జిట్ పోల్స్ సైతం బీజేపీదే విజమని స్పష్టం చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ.. బీజేపీ విజయబాట పడుతోంది. 27 ఏళ్ల కింద బీజేపీ నేత సుష్మా స్వరాజ్ 52 రోజుల పాటు ఢిల్లీ సీఎంగా పని చేశారు. కేజ్రీవాల్ అనంతరం మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌ రాజీనామా చేసి తర్వాత ఢిల్లీ ఎన్నికల స్వరూపం పూర్తిగా మారిపోయింది. అయితే, బీజేపీ గెలుపు.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి వివిధ కారణాలున్నాయని రాజకీయ విశేష్లకులు చెబుతున్నారు. ఈ కారణాల వల్లే ఆమ్‌ ఆద్మీ ఓటమి పాలైందని అంచనా వేస్తున్నారు.


గత రెండేళ్ల నుంచి ఆమ్‌ ఆద్మీనేతలు వరుసగా జైలు పాలవ్వడం ఆ పార్టీకి మైనస్‌గా మారిందని భావిస్తున్నారు. లిక్కర్ కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయి జైలుకు వెళ్లారు. అరెస్ట్ అయినప్పుడు కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. 2024 సెప్టెంబర్‌లో తన పదవికి రాజీనామా చేయగా.. అతిషి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ కీలక నేతల్లో ఒకరైన సత్యేందర్‌ జైన్‌ మనీలాండరింగ్‌ కేసులో జైలుకు వెళ్లారు. అదే సమయంలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా సైతం లిక్కర్ కేసులో జైలుకెళ్లారు. రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ సైతం జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇలా ఆప్ నేతలందరూ జైలుకెళ్లడం ఆ పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారింది. అసలు విషయం ఏంటంటే.. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌.. అదే అవినీతి ఆరోపణల్లో చిక్కుకుపోయారు. ఈ కారణాలు ఆప్ ఓటమికి ప్రభావితం చేశాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Shamshabad News: దారుణం.. చివరకు ఆరేళ్ల బాలికను కూడా..?

ఈ ఎన్నికల్లో ఆప్ తరహాలోనే బీజేపీ సైతం ఉచిత పథకాలను ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ సైతం అదే ట్రిక్‌ని ప్లే చేసింది. బీజేపీ రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, గర్భిణులకు ఆర్థిక సాయం,వృద్ధులకు రూ.2500 పెన్షన్‌, ఆయుష్మాన్‌ భారత్‌, రూ.5కే భోజనం తదితర పథకాలను ప్రకటించింది. గతంలో ఉచిత పథకాల జోలికి వెళ్లిన బీజేపీ.. ఈ సారి భిన్నంగా భారీ హామీలిచ్చింది. ఫలితంగా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటిమికి ఇవ్వి కూడా కారణాలు అయ్యాయి.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×