E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పక్కదేశంలో జక్కన్నకి అరుదైన గౌరవం.. గ్లోబల్ స్టేజ్ పై ఘర్జన!

పక్కదేశంలో జక్కన్నకి అరుదైన గౌరవం.. గ్లోబల్ స్టేజ్ పై ఘర్జన!
Advertisement

Rajamouli: ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరించి, దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు రాజమౌళి.. ముఖ్యంగా తెలుగు సినిమాని అగ్రస్థానంలో నిలిపిన ఈయన ఏం చేసినా సరే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతారు అనడంలో సందేహం లేదు. అలాంటి రాజమౌళి అపజయమెరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టేజ్ పై ఘర్జిస్తూ అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ శాశ్వత గుర్తింపును అందుకున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మూవీకి తెరలేపిన రాజమౌళి ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు.

గ్లోబల్ రేంజ్ లో మరో గుర్తింపు..

ఇక బాహుబలి 2 చిత్రంతో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించారు.అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆస్కార్ వేదికపై మెరిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వారణాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న రాజమౌళి.. తాజాగా తన ఖాతాలో మరో అంతర్జాతీయ స్థాయి గౌరవాన్ని దక్కించుకున్నారు.

హెన్రీ లాంగ్లోయిస్ హాల్ లో శాశ్వత సీట్..

Advertisement

ఇక ఏమిటా రికార్డు అనే విషయానికొస్తే.. ఫ్రాన్స్ పర్యటనలో రాజమౌళిని అక్కడి ప్రతిష్టాత్మక ఫిలిం ఇన్స్టిట్యూట్ అత్యున్నత రీతిలో సత్కరించింది. ఫ్రాన్స్ రాజధాని అయిన పారిస్ లోని ప్రఖ్యాత సినెమాథిక్ ఫ్రాన్సైస్ సంస్థకు చెందిన చారిత్రక హెన్రీ లాంగ్లోయిస్ హాల్ లో రాజమౌళి పేరిట ఒక శాశ్వత సీటును కేటాయించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత దిగ్గజ ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ ఆధ్వర్యంలో రాజమౌళికి ఈ అరుదైన గౌరవాన్ని అందించారు. ముఖ్యంగా ఈ చారిత్రక సంస్థలో రాజమౌళి కోసం శాశ్వత సీటు కేటాయించడమే కాకుండా ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

also read:పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓజీ 2 నుండీ బిగ్ అప్డేట్!

రాజమౌళి ఎమోషనల్ నోట్..

Advertisement

ఇకపోతే రాజమౌళి తనకు దక్కిన ఈ అసాధారణమైన గౌరవానికి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నారు రాజమౌళి. “పారిస్ నగరంలో నా సినిమాలను ప్రదర్శించడమే కాకుండా ఇక్కడికి ఆహ్వానించడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. దీనికి తోడు హెన్రీ లాంగ్లోయిస్ హాలులో నా పేరిట శాశ్వత స్థానాన్ని కల్పించడాన్ని నేను అస్సలు ఊహించలేదు. ఈ మధురమైన ఆశ్చర్యం నన్ను తీవ్ర ఉద్వేగానికి లోను చేస్తోంది. ముఖ్యంగా ఈ అనుభూతిని నేను మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాను” అంటూ తెలిపారు. ఇకపోతే ప్రపంచ సినిమా చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలో రాజమౌళి కి శాశ్వత సీట్ దక్కడంపై పలువురు అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాజమౌళి చిత్రాలు..

ఇక రాజమౌళి చిత్రాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాని పేరే వారణాసి. గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజమౌళి తండ్రి , ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. ఇక భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related News

జాన్వీ కపూర్ దక్షిణాదిలోనే స్థిరపడనుందా.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!

వ్యూస్ కోసం ఇంతలా దిగజారాలా?.. భాగ్యరాజ్ అంత్యక్రియల్లో మీడియాపై రాధిక ఫైర్!

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓజీ 2 నుండీ బిగ్ అప్డేట్!

కొద్ది గంటల్లోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్..నాగవంశీ లీక్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలే!

ఇండియాలో సునామీ సృష్టించిన చిన్న సినిమా… .ఏ ఓటీటీ లో తెలుసా ?

డైరెక్టర్ గా హీరో రామ్ కొత్త అడుగు.. ఘనంగా ‘RAPO23’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

రణబాలి నుండి స్పెషల్ వీడియో రిలీజ్.. విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Big Stories

×