TG ICET Notification: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎంబీఏ చేయాలని అనుకునే వారికి ఇది సువర్ణవకాశం. తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్- 2025 (టీఎస్ఐసెట్) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ సారి పరీక్ష నల్గొండలోని మహాత్మగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ) కండక్ట్ చేయనుంది.
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (టీఎస్‌ఐసెట్) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
అర్హత ఉన్న అభ్యర్థులు మే 3 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు జూన్ 8, 9 తేదీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయనున్నారు.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: మార్చి 10
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మే 3
రూ.250 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 26 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
హాల్ టికెట్ డౌన్ లోడ్ తేది: మే 28 నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఎగ్జామ్ డేట్స్: జూన్ 8, 9 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
పరీక్ష ప్రాథమిక కీ విడుదల: జూన్ 21
ప్రాథమిక కీపై అభ్యంతరాలకు గడువు: జూన్ 22 నుంచి 26 వరకు.
ఐసెట్ తుది కీ రిలీజ్: జూలై 7
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (టీఎస్ ఐసెట్) ద్వారా ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
ఎగ్జామ్ ద్వారా తీసుకునే కోర్సులు: ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ ఆప్లికేషన్స్) కోర్సులు ఉంటాయి.
విద్యార్హత:
ఎంబీఏ కోర్సు: కనీసం 50 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీ/బీసీ 45శాతం) మార్కులతో ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ పాసై ఉండాలి
ఎంసీఏ కోర్సు: ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జె్క్టు చదివి ఉండాలి) పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.550 ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్స్: రాష్ట్రంలోని 16 టెస్ట్ జోన్ లలో ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఈ ఎంట్రన్స్ టెస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి.
దరఖాస్తు సవరణకు తేదీలు: మే 16 నుంచి 20 వరకు సవరించుకోవచ్చు.
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే మార్చి 10న ప్రారంభమయ్యే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు పెట్టుకోండి. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తుక ప్రక్రయకు చివరి తేది: 2025 మే 3
పరీక్షల నిర్వహణ: జూన్ 8, 9