Pakistan Performances: 29 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఓ ఐసీసీ టోర్నీ {ఛాంపియన్స్ ట్రోఫీ 2025} కి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ లో చివరగా 1996 పురుషుల వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఈ టోర్నీకి పాకిస్తాన్ తో పాటు భారత్, శ్రీలంక దేశాలు అతిథ్యం ఇచ్చాయి. అప్పటినుండి భద్రతా కారణాల దృశ్య పాకిస్తాన్ లో ఒక ఐసీసీ ఈవెంట్ కూడా జరగలేదు. ఇక 2017లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ జట్టు గెలుచుకుంది.
ఆ తర్వాత 2022లో టి-20 వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు వెళ్ళింది. ఇక అప్పటినుండి పాకిస్తాన్ జట్టు ఆ స్థాయిలో ప్రదర్శన చేసింది లేదు. పాకిస్తాన్ జట్టులో ఎంతో ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆ జట్టు జింబాబ్వే కంటే దారుణంగా ఆడుతుంది. సొంత దేశంలో ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో.. వరుస ఓటములను ఎదుర్కొని గ్రూప్ దశ నుండే నిష్క్రమించింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం తన చరిత్రలో అత్యంత అవమానకరమైన దశను ఎదుర్కొంటుంది.
గత మూడు సంవత్సరాలుగా ఆ జట్టు ప్రదర్శనపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రాజకీయాలు, ఆటగాళ్ల ఎంపికలో పారదర్శకత లేకపోవడం వల్ల జట్టు నిరంతరం విమర్శలను ఎదుర్కొంటుంది. ఆ జట్టుకు అటు శాశ్వత కెప్టెన్ ఇటు బలమైన వ్యూహం లేదు. దీంతో ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా పేరుగాంచిన పాకిస్తాన్ జట్టు.. ఇప్పుడు బలహీనమైన జట్లతో కూడా ఓడిపోతుంది.
ఈ పరిస్థితికి అతిపెద్ద కారణం వారి సొంత క్రికెట్ బోర్డ్ అని అంటున్నారు క్రీడాభిమానులు. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో గడిచిన మూడు సంవత్సరాలలో 26 మంది సెలెక్టర్లు మారారు. అలాగే నలుగురు కెప్టెన్లు, 8 మంది కోచ్ లు కూడా మారారు. ఈ మార్పులను బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. అంతేకాకుండా పాకిస్తాన్ స్వదేశంలో జరిగిన ఒక్క టెస్ట్ సిరీస్ తప్ప.. దాదాపు వెయ్యి రోజులుగా స్వదేశంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రాజకీయాలు ఆటగాళ్ల ప్రదర్శన పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. ఓవైపు కెప్టెన్లను మరుగు వైపు కోచింగ్ సిబ్బందిని తరచుగా మార్చడం వల్ల వారు సరైన ఫోకస్ చేయలేకపోయారని క్రికెట్ వర్గాల అంచనా. ఇక మరీ ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. టెస్టులు మాత్రమే కాకుండా వన్డేలు మరియు టి-20 లు, ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో కూడా ఆ జట్టు అట్టడుగున నిలిచింది.
అయితే పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ వ్యవహార శైలి బాగా లేకపోవడంతో ఇటీవల గ్యారీ కిర్ స్టెన్ తన పదవికి రాజీనామా చేశాడు. అంతేకాకుండా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ తీరుపై ఆరోపణలు చేశారు. సెలక్షన్ కమిటీలో పక్షపాత ధోరణి పెరిగిపోయిందని.. జట్టులో అనుకూలంగా ఉండేవారిని ఎంపిక చేయడం ఎక్కువైందని ఆరోపించాడు. ఇలా గడిచిన మూడు సంవత్సరాలుగా పాకిస్తాన్ జట్టులో వంద మార్పులు చేసినప్పటికీ పాకిస్తాన్ దరిద్రం మాత్రం మారడం లేదు.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 8, 2025