UPSC Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చును. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం కనుకు మీకు వచ్చినట్లయితే భారీ వేతనం ఉండనుంది.
న్యూ ఢిల్లీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2025 కండక్ట్ చేస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్‌లో 357 అసిస్టెంట్ కమాండెంట్ల (గ్రూప్ ఎ) ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ పాస్ అయిన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 25వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 357
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2025 ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వెకెన్సీ వారీగా ఉద్యోగాలు:
బీఎస్ఎఫ్: 24 ఉద్యోగాలు
సీఆర్‌పీఎఫ్: 204 ఉద్యోగాలు
సీఐఎస్ఎఫ్: 92 ఉద్యోగాలు
ఐటీబీపీ: 4 ఉద్యోగాలు
ఎస్‌ఎస్‌బీ: 38 ఉద్యోగాలు
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మార్చి 25
దరఖాస్తు సవరణ తేదీలు: 2025 మార్చి 26 నుంచి 2025 ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు సవరణ చేయవచ్చు.
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. అలాగే నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.200 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది)
వయస్సు: 2024 ఆగస్ట్ 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్2 ఉంటాయి. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://upsc.gov.in/
అప్లికేషన్ లింక్: https://upsconline.gov.in/upsc/OTRP/
ALSO READ: BDRCL Recruitment: డిగ్రీ అర్హతతో జాబ్స్ భయ్యా.. ఈ ఉద్యోగం నీకు వస్తే జీతం రూ.2,00,000
ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 357
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 25