E-Paper
Advertisement

TOMCOM Foreign Recruitment: ఫారిన్ కంట్రీలో నెలకు రూ.1.5 లక్ష జీతం.. తెలంగాణ ప్రభుత్వ ఏజెన్సీ రిక్రూట్మెంట్

TOMCOM Foreign Recruitment: ఫారిన్ కంట్రీలో నెలకు రూ.1.5 లక్ష జీతం.. తెలంగాణ ప్రభుత్వ ఏజెన్సీ రిక్రూట్మెంట్
Advertisement

TOMCOM Foreign Recruitment| విదేశాల్లో స్కిల్డ్ (నైపుణ్యం), సెమీ స్కిల్డ్ (సెమీ నైపుణ్యం)ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్ర రెజిస్టర్డ్ ఏజెన్సీ ప్రకటన జారీ చేసింది. యురోప్ దేశమైన పోర్చుగల్ లో ఆతిథ్యం (హోటల్స్), మెయింటెనెన్స్, బిజినెస్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉద్యోగులు కావాలని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (Telangana Overseas Manpower Company Limited – TOMCOM) ప్రకటించింది. ఈ ఉద్యోగాల చేసేవారికి నెలకు 900 యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ.90,000) నుంచి 1500 యూరోలు (రూ.1,50,000) వరకు నెలసరి వేతనం ఉంటుంది.

పోర్చుగల్‌లో ఉద్యోగాలు, జీతాల వివరాలు..

Advertisement

పోర్చుగల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ సాలరీ ఇచ్చే ఉద్యోగాల జాబితా.

  • F&B మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్: నెలకు 1500 యూరోలు (సుమారు 1.5 లక్షల రూపాయలు)
  • ఎగ్జిక్యూటివ్ షెఫ్: నెలకు 1400 యూరోలు (సుమారు 1.4 లక్షల రూపాయలు)
  • ఈవెంట్స్ కోఆర్డినేటర్: నెలకు 1200 యూరోలు (సుమారు 1.2 లక్షల రూపాయలు)
  • హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్ మరియు కుక్ (లైన్/స్టేషన్): నెలకు 1100 యూరోలు (సుమారు 1.1 లక్షల రూపాయలు)
  • మెయింటెనెన్స్ టెక్నీషియన్ మరియు స్పా థెరపిస్ట్: నెలకు 1000 యూరోలు (సుమారు 1 లక్ష రూపాయలు)
  • వెయిటర్, హౌస్‌కీపర్, మరియు డిష్‌వాషర్/కిచెన్ అసిస్టెంట్: నెలకు 900 యూరోలు (సుమారు 90,000 రూపాయలు)

అర్హతలు
ఈ ఉద్యోగాలకు అర్హతలు ఉద్యోగ రకాన్ని బట్టి మారుతాయి. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ (12వ తరగతి) విద్యతో పాటు అనుభవం అవసరం. మరికొన్ని ఉద్యోగాలకు హోటల్ మేనేజ్‌మెంట్, క్యులినరీ ఆర్ట్స్ (వంట వార్పు), మార్కెటింగ్, లేదా ఈవెంట్ కోఆర్డినేషన్‌లో డిగ్రీ అవసరం.

Advertisement

వయస్సు, అనుభవం
ఈ ఉద్యోగాలకు అర్హత పొందాలంటే అభ్యర్థుల వయస్సు 21 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే, సంబంధిత రంగంలో 2 నుండి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం
ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమెలను tomcom.resume@gmail.comకు పంపించాలి. మరిన్ని వివరాల కోసం TOMCOM అధికారిక నెంబర్లు.. 9440052592, 9440049937, లేదా 9440051452 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.

తెలంగాణ రాష్ట్రం తన యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తోంది. TOMCOM ద్వారా చట్టబద్ధమైన, ప్రభుత్వ సహాయంతో కూడిన విదేశీ ఉద్యోగ ప్లేస్‌మెంట్‌లను సులభతరం చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా నైపుణ్యం కలిగిన యువతకు మంచి జీతాలతో, విదేశాల్లో ఉద్యోగాలు సాధించే అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాము.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×