BigTV English

OTT Movie : చిన్న పిల్లల్ని బావికి బలిచ్చే వింత మనుషులు… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : చిన్న పిల్లల్ని బావికి బలిచ్చే వింత మనుషులు… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie : చేతబడి, కల్ట్ ఆచారాలు, సూపర్ నాచురల్ వంటి జానర్ లో ఈ మధ్య సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ సినిమాలను ఇంట్రెస్టింగా చూస్తున్నారు మూవీ లవర్స్ . ఈ సినిమాలు ఓటీటీలో కూడా టాప్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఇందులో కొంత మంది చిన్నపిల్లల్ని దుష్ట శక్తి ఉండే బావికి బలిస్తుంటారు. ఈ స్టోరీలో వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలతో బెదరగొడుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ హారర్ మూవీ పేరు ‘ఛోరీ 2’ (Chhorii 2). 2025లో వచ్చిన ఈసినిమాకి విశాల్ ఫూరియా దర్శకత్వం వహించారు. దీనిని భూషణ్ కుమార్, కృషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, జాక్ డేవిస్ నిర్మించారు. ఈ మూవీ 2021లో విడుదలైన Chhorii చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది. ఈ సినిమాలో నుష్రత్ భరూచా, సోహా అలీ ఖాన్, గష్మీర్ మహాజని, హర్దిక శర్మ, సౌరభ్ గోయల్, కుల్దీప్ సరీన్, పల్లవి అజయ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ప్రీమియర్ అయింది. 2 గంటల 12 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDB లో 4.5/10 రేటింగ్ ఉంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ Chhorii మొదటి పార్ట్ సంఘటనలు జరిగిన ఏడు సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది. సాక్షి ఇప్పుడు ఒక స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ, తన ఏడు సంవత్సరాల కుమార్తె ఇషానీతో నగరంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఇషానీకి ఒక అరుదైన వైద్య సమస్య వస్తుంది. దీనివల్ల ఆమెకు సూర్యకాంతి మీద పడితే శరీరం దెబ్బతింటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ చీకటి గదిలో లేదా పూర్తిగా కప్పబడిన దుస్తులతో ఉంటుంది. సాక్షికి సమర్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్ స్నేహితుడిగా ఉంటాడు. ఇలాఉండగా ఒక రోజు రాత్రి, ఒక దుష్ట శక్తి ఇషానీని ఎత్తుకెళ్లిపోతుంది. సాక్షి తన కుమార్తెను కాపాడేందుకు మళ్లీ ఆ భయంకరమైన చెరకు తోటలు, శాపగ్రస్త గ్రామంలోకి వెళ్లవలసి వస్తుంది.

ఇప్పుడు సాక్షి, సమర్ ఇషానీని వెతకడం ప్రారంభిస్తారు. వీళ్ళు ఆ గ్రామంలో ఉండే భూమిలోపల ఉండే ఒక సొరంగ మార్గం లోకి వెళతారు. ఇక్కడ ఒక కల్ట్ ఆధీనంలో ఉన్న దాసీ మా అనే ఒక శక్తివంతమైన హై ప్రీస్టెస్, ఇషానీని తమ నాయకుడు “ప్రధాన్ జీ” ఆరోగ్యాన్ని కాపాడేందుకు బావికి బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. సాక్షి తన కుమార్తెను రక్షించడానికి, దాసీ మాతో పాటు ఊరిలో ఉండే దుష్ట శక్తితో పోరాడుతుంది. ఈ క్రమంలో స్టోరీలో  ఊహించని ట్విస్ట్లు వస్తాయి. చివరికి సాక్షి తన కూతుర్ని కాపాడుకుంటుందా ? ఆ దుష్ట శక్తిని ఎదుర్కుంటుందా ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : బ్యూటీ పార్లర్ ముసుగులో అమ్మాయిల అరాచకం… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

Related News

Trail OTT: కాజోల్ ట్రయల్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OTT Movie: సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసిన అనుపమ కొత్త మూవీ.. ఎక్కడంటే?

OTT Movie : 50 ఏళ్ల ఆంటీతో ఆటగాడి అరాచకం… ఆ పనికి నో చెప్పడంతో ఊహించని షాక్… ఫ్యామిలీతో చూడకూడని మూవీ

OTT Movie : చావు ఇంట్లో చక్కిలిగింతలు… 16 గంటల్లో సాగే స్టోరీ… ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ కామెడీ డ్రామా

OTT Movie : రాత్రికి మాత్రమే వచ్చిపోయే చందమామ… పెళ్లి వద్దు అదే ముద్దు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Darshana Rajendran: రియల్ స్టోరీతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Big Stories

×