BigTV English

India-US Trade Deal: భారత్‌తో బిగ్ డీల్.. ట్రంప్ సంచలనం

India-US Trade Deal: భారత్‌తో బిగ్ డీల్.. ట్రంప్ సంచలనం

India-US Trade Deal: ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.. అన్నిటినీ కలపడం చాలా చాలా కష్టం. కానీ ఈ టాస్క్ ని ట్రంప్ కిగానీ అప్పగిస్తే.. ఎంతో సులువుగా చేసేస్తారా పని. తన తొలి పాలనలో పాక్ అంతు చూస్తానని.. తర్వాత అదే పాక్ ఆర్మీ చీఫ్ తో విందు చేశారు. ఇక చైనాతో పీకలోతు వాణిజ్య యుద్ధం చేస్తానన్నారు. ఫైనల్ గా ఇప్పుడు బిగ్ డీల్ అంటున్నారు. ఇక ఇండియాతో ఆడిన ఆటలు అన్నీ ఇన్నీ కావు. మన విద్యార్ధుల జీవితాలతోనూ చెడుగుడు ఆడేసుకుంది ట్రంప్ సర్కార్. ఫైనల్ గా అదే భారత్ తో బిగ్ డీల్ అంటోంది ఆయన నాయకత్వంలోని అమెరికా. ఏంటీ ట్రంప్ మార్క్ ట్రేడ్ సీక్రెట్? ఆ డీటైల్స్ ఏంటి?


ట్రంప్ విషయంలో అలాంటి ఈక్వేషన్స్ ఏవీ పని చేయవ్

పాకిస్థాన్‌ని దగ్గరకు చేర్చడం అంటే భారత్ తో చెలిమికి కటీఫ్ చెప్పడమే. ఇది ఏ చిన్న పిల్లాడ్ని అడిగినా చెప్పేస్తారు. కానీ ట్రంప్ విషయంలో అలాంటి ఈక్వేషన్స్ ఏవీ పని చేయవ్. అటు ఇటు రెండింటిని కలిపి కొట్టేస్తారు ట్రంప్. ఇది యాపారం.. ఇక్కడ అటూ అవసరమే. ఇటూ అవసరమే. ఇందులో నో మొహమాటమ్స్.. అన్నది ట్రంప్ మార్క్ స్ట్రాటజీ.


పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కి యూఎస్ ఆర్మీ పెరేడ్ కి ఆహ్వానం

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ఆర్మీచీఫ్ మునీర్ ని తన పుట్టిన రోజున, తమ దేశపు ఆర్మీ పేరడ్ కి పిలిచిన ట్రంప్.. అతడికి స్వయానా తానే దగ్గరుండి విందు ఇచ్చారు. అంతేనా తన కుటుంబంతో అతడి ద్వారా ఎన్నో వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నారు. దానికి తోడు పహెల్గాం దాడి కారకుడైన కసూరీని ఉగ్రవాదిగా యూఎన్ ద్వారా గుర్తిస్తూనే.. ఐఎంఎఫ్ నిధులు పాక్ కి రెండు డాలర్లు ఎక్కువ ఇప్పిస్తారు. భారత్ కి వ్యతిరేకంగా ఎన్నో పనులు. అయినా సరే భారత్ తో తమ బంధం ఎంతో గాఢమైందన్న కలరింగ్ ఇస్తారు. దటీజ్ ట్రంప్ టెండెన్సీ.

భారత్ కి వ్యతిరేకంగా పాక్ కి చెలిమి

తన రెండో రాకడలో ట్రంప్ భారత్ వ్యతిరేకంగా కేవలం పాకిస్థాన్ తో చెలిమి చేయడం మాత్రమే కాదు. వరుస ఇన్సిడెంట్లు. మన వాళ్లకు అక్కడ చుక్కలు చూపిస్తున్నారు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా పెట్టేబేడా సర్దుకుని పేకప్ చెప్పేయడమే. ఇక బిగ్ బ్యూటిఫుల్ బిల్ సంగతి సరే సరి. ఒక సమయంలో ఎన్నారైలు భారత్ లోని తమ కుటుంబాలకు డబ్బు పంపడంపై కూడా పన్ను విధిస్తారన్న మాట వెలుగు చూసింది. అలా స్థానిక భారతీయులకు వ్యతిరేకంగా ఎన్నో ఘటనలు జరిగాయి. అయినా సరే ఇప్పుడు భారత్ తో బిగ్ డీల్ అంటున్నారు ట్రంప్. భారత్ చాలా పెద్దదని.. ఆ దేశంతో గొప్ప వాణిజ్య ఒప్పందం చేసుకుంటామని.. ఇది ఎంతో గొప్ప ఒప్పందం అవుతుందని అంటున్నారు.

నిన్న చైనాతో ఒప్పందం రేపు భారత్ తో ఉండొచ్చు- ట్రంప్

ప్రస్తుతం ట్రంప్ చెబుతున్నదేంటంటే.. ప్రతి ఒక్కరూ ఒక ఒప్పందం కుదర్చుకుని అందులో భాగం కావాలని కోరుకుంటారనీ. గతంలో తనను కొన్ని పత్రికలు ఇలాగే ప్రశ్నించాయని.. నిన్న చైనాతో ఒప్పందం చేసుకున్నామనీ. వచ్చే రోజుల్లో భారత్ దేశంతోనూ ఒక ఒప్పందం చేసుకుంటామనీ.. ఇది చాలా పెద్దదవుతుందని అనేశారు ట్రంప్.

కొన్ని దేశాలకు లెటర్ పంపి.. 25, 35, 45 శాతం

అట్ ద సేమ్ టైం అమెరికా ఏ ఇతర దేశంతోనూ వాణిజ్య ఒప్పందం చేసుకోదని కూడా అన్నారు ట్రంప్. కొందరికి కొన్ని నమస్కారాలు చెప్పి ఒక లెటర్ పంపిస్తాం. మీరు 25, 35, 45 శాతం సుంకాలు చెల్లించాలి. అలా చేయడమే సులభమని తేల్చి చెప్పేశారు ట్రంప్.

గత కొన్నాళ్లుగా చైనాతో వాణిజ్య యుద్ధం

అంటే భారత్ చైనా వంటి పెద్ద దేశాలతో మాత్రమే సరిసమానమైన ఒప్పందాలు చేసుకుంటామని సూచనప్రాయంగా చెప్పుకొచ్చారు ట్రంప్. మరి చైనాతో చేసుకున్న డీల్ ఏంటని చూస్తే గత కొంతకాలంగా చైనా యూఎస్ కి వాణిజ్య యుద్ధం జరుగుతోంది.. దీంతో చైనా.. అరుదైన ఖనిజాల సరఫరా నిలిపేసింది. ఈ దిశగా చైనాతో ఒప్పందం చేసుకోవల్సి వచ్చింది. ఇదే బిగ్ డీల్ అనుకుంటే భారత్ తో మరింత పెద్ద ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

భారత్- యూఎస్ మధ్య నాలుగు రోజుల చర్చలు

భారత్- అమెరికా మధ్య మెగా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి నాలుగు రోజుల పాటు చర్చలు జరిగాయి. పారిశ్రామికంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల అంశంలో వీరీ చర్చలు సాగించారు. మార్కెట్ యాక్సెస్, సుంకాల కోతలు, ఒప్పందాల్లో ఎదురు కానున్న అడ్డంకులపై చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. యూఎస్ ప్రతినిధుల బృందానికి యూఎస్ వాణిజ్య విభాగం అధికారులు నాయకత్వం వహించగా.. భారత్ నుంచి రాజేష్ అగర్వాల్ లీడ్ చేసినట్టు తెలుస్తోంది.

2030 నాటికి యూఎస్- భారత్ మధ్య 500 బి. డా.

మొత్తంగా చూస్తే ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 190 బిలియన్ల నుంచి 2030 నాటికి 500 బిలియన్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 10న చర్చలు ముగిసిన సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. భారత్- అమెరికా రెండు ఆర్ధిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూరేలా.. ఒప్పంద చర్చలు జరిగాయని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో.. మోడీ ట్రంప్ మధ్య సమావేశం జరిగిందనీ.. ఇరువురు నేతలు.. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పై సంతకాలు చేయాలని నిర్ణయించారనీ.. ఇది పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని అన్నారాయన. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకారిగా ఉండే విధంగా.. తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన.

వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు- యూఎస్ వాణిజ్య సెక్రటరీ

ఈ నెల ప్రారంభంలో అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ సైతం భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కావచ్చని అన్నారు. రెండు దేశాలు తమ ప్రయోజనాలకు తగిన కామన్ గ్రౌండ్ ని కనుగొంటామని కూడా అన్నారు.

జెనివా ఒప్పందం అమలు చేసే దిశగా యూఎస్- చైనా

బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమంలో ప్రసంగించిన ట్రంప్ ఇప్పటికే చైనాతో వాణిజ్య ఒప్పందం పై సంతకం చేశామని అన్నారు. ఒప్పంద వివరాలను పూర్తిగా వెల్లడించకున్నా.. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణా వేగవంతం చేయడంపై ఈ ఒప్పందం దృష్టి సారించినట్టుగా చెబుతున్నారు వైట్ హౌస్ ప్రతినిథులు. జెనివా ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు పక్షాలు అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది.

చైనాకే కాదు అమెరికాకు కూడా భారత్ ప్రధాన మార్కెట్ ఏరియా- ఇండియా

భారత్ మార్కెట్ పరంగా ఎంతో పెద్ద దేశం. ఇటు చైనాకే కాదు అమెరికాకు కూడా భారత్ ప్రధాన మార్కెట్ ఏరియా- ఇండియా. పాక్‌తో అమెరికాకు ఉండే అవసరాలు వేరు. అదే భారత్ తో ఉండే అవసరాలు వేరు. భారత్ తో ఒకటికి రెండు లాభాలుంటాయి. ఇక్కడి మార్కెట్ ఎంత పెద్దదో మానవ వనరుల ద్వారా లభించే సర్వీసులు కూడా అంతే విలువైనదిగా తెలుస్తోంది.

USIBC పుట్టి ఇప్పటికి యాభై ఏళ్లు

యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ పుట్టి యాభై ఏళ్లు. ఈ సందర్భంగా USIBC అధ్యక్షుడు రాయబారి అతుల్ కేశప్ ఏమన్నారంటే.. యాభై సంవత్సరాల క్రితం, USIBC ద్వారా యూఎస్- భారత్ మధ్య సంబంధాలకు యాభై ఏళ్లయ్యాయి. ఈ క్రమంలో తాము కలిస్తే ఎన్నో సాధించగలమన్న నమ్మకం పుట్టింది. ఈ బలమైన పునాదుల మీద వచ్చే యాభై ఏళ్లను మరింత సాధిస్తామని అన్నారాయన.

ఐటీ, స్పేస్, మెడిసిన్, లా వంటి రంగాల్లో భారత్ కీలక పాత్ర

భారత్ అమెరికా మధ్య సంబంధ బాంధవ్యాలు నేడిలా ఉండటం వేరు. గతం వేరు. యూఎస్ లో భారత్ లేనిదే కొన్ని పనులు జరగవు. ఇప్పటికీ అక్కడి ఐటీ ప్రాజెక్ట్ బెంగళూర్డ్ కావల్సిందే. అంతే కాదు.. స్పేస్, మెడిసిన్, లా వంటి రంగాల్లో భారత్ పాత్ర విడదీయలేని అనుబంధం. ఆ మాటకొస్తే అక్కడ ట్యాక్స్ పేయర్స్ లో భారతీయులు 1. 5 శాతం వరకూ ఉంటారు.

హయ్యర్ ఎడ్యుకేషన్, లాబ్స్, R & D, ఐటీ

భారత్ యూఎస్ మధ్య భాగస్వామ్యానికి వాణిజ్యం నేడు అతి పెద్ద కేంద్రం. హయ్యర్ ఎడ్యుకేషన్, లాబ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఐటీ, స్టార్ట్- అప్ ఇంక్యుబేటర్స్.. హ్యూమన్ రీసోర్స్ వంటివి వీటిలో అత్యంత ప్రధానమైనవి. వీటితో పాటు లోతైన ప్రతిభా పాటవాలు గల సామర్ధ్యం, ఏఐ, క్వాంటమ్, సెమీకండెక్టర్లు, బయో సెక్నాలజీ..ఇంకా TRUST వంటి ఎన్నో అంశాలపై ఇరు దేశాల మధ్య గత కొన్నాళ్లుగా ఎన్నో సంబంధ బాంధవ్యాలున్నాయి.

రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం

దీంతో భారత్- అమెరికా మధ్య STRONG రిలేషన్ కొనసాగుతోంది. సాంకేతికత, వాణిజ్యంతో పాటు.. రక్షణ వంటి రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. వీటితో పాటు ఇంధన భద్రత, ప్రజారోగ్యం వంటి విషయాల్లోనూ ఒప్పందాలు కుదిరే ఛాన్సులున్నాయి.

సంయుక్త సైనిక విన్యాసాలు జరిగే అవకాశం

పాక్ తో చెలిమి చేస్తే అమెరికాకు మిగిలేది ఖర్చే. ఆ దేశానికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం కుదరని పని. అదే భారత్ తో అలా ఉండదు. ప్రతిదీ లాభదాయకమే. ఇటు సర్వీస్ సెక్టార్ ద్వారా వీలైనంత చౌక ధరలకు ఆయా రంగాల్లో సేవలను పొందే అవకాశముంది. సరిగ్గా అదే సమయంలో రక్షణ పరంగా ఎంతో సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే రోజుల్లో సైనిక సహకారం, సాంకేతిక బదిలీ, సంయుక్త సైనిక విన్యాసాల వంటివి మరింత మెరుగ్గా జరిగే అవకాశముంది.

పదేళ్లకు 50 వేల కోట్లకు వాణిజ్యం పెరిగే ఛాన్స్

అమెరికాకు భారత్ ఎంత పెద్ద మార్కెట్ అంటే ఇప్పటికే భారత్ అమెరికా వాణిజ్యం 190 బిలియన్ డాలర్ల మేర ఉంటే.. దాన్ని మరో పదేళ్లకు ఐదు వందల బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న యోచనలో ఉన్నారు. ఈ మొత్తం విలువ భారత కరెన్సీలో చెబితే.. సుమారు యాభై వేల కోట్ల రూపాయలు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకూ ఎన్నో రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చిపుచ్చుకునే అవకాశముంది. ఇటు టారిఫ్ లు తగ్గించడం, అటు కొత్త వాణిజ్య మార్గాలను అన్వేషించడం వంటి విషయాలలో ఇప్పటికే చర్చలు జరిగాయి.

ఇండో- పసిఫిక్ లో చైనా ప్రభావం ఎదుర్కునేందుకు..

సాంకేతిక రంగం వీటన్నిటిలోకీ అత్యంత ప్రధానంగా కనిపిస్తోంది. కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఎన్నో ఒప్పందాలు జరిగేలా తెలుస్తోంది. ఇక ఇండో- పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోడానికి, ఉగ్రవాద నిరోధకత వంటి అంశాలపై భారత్- యూఎస్ కలసి పని చేసే ఛాన్సు కనిపిస్తోంది. ఇక చమురు, సహజ వాయువు ఇతర ఇంధన వనరుల కోసం భారత్ కు ఇందన సరఫరా పెంచడానికి మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంటు వ్యాధుల నివారణలోనూ కోపరేషన్

వీటతో పాటు సైబర్ నేరాల దర్యాప్తులో సహకారం, భారత్ యూఎస్ మధ్య ఒప్పందాలు కుదరవచ్చు. ఇక అంటు వ్యాధుల నివారణ చికిత్స లో సహకారం కోసం రెండు దేశాల మధ్య అగ్రిమెంట్లు కుదరొచ్చు. ఈ ఒప్పందాలన్నీ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తాయి. భవిష్యత్తులో మరింత సహకారానికి దారి తీసేలా తెలుస్తోంది.

Related News

Yellandu Politics: ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పెత్తనంపై వ్యతిరేకత..

Congress: కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందా..?

Srikakulam Politics: దువ్వాడ కుల రాజకీయం

KCR: కేటీఆర్ కామెంట్స్.. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటో?

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..

Bigg Boss AgniPariksha E3 Promo1: ఎమోషన్స్ తో చంపేస్తున్న సామాన్యులు.. వర్కౌట్ అవుతుందా?

Big Stories

×