E-Paper
Advertisement

TS SET 2024: సెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

TS SET 2024: సెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Advertisement

TS SET- 2024 Notification: తెలంగాణ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రతీ ఏటా సెట్ నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ నెల 14 నుంచి జూలై 2 వరకు అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెట్ పరీక్ష కోసం ఈ నెల 14 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 29 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఎంఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంటెక్, ఎంసీజేలతో పాటు పలు కోర్సుల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. సెట్ రాసేందుకు గరిష్ట వయో పరిమితి అంటూ ఏమీ లేదు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఆగస్టు 20 నుంచిహాల్ టికెట్లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 28 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

తేదీల వివరాలు ఇవే..

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 14, 2024
ఆన్‌‌‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 2, 2024
ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 26, 2024
హాల్ టికెట్లు డౌన్ లోడ్ తేదీ : ఆగస్టు 20 ,2024
పరీక్షతేదీలు: ఆగస్టు 28, 29, 30, 31

Advertisement

Also Read: తెలంగాణలో టెట్ పరీక్షల తేదీలు మార్పు..!

పరీక్ష విధానం:

సెట్ 2024 పరీక్ష ఆబ్జెక్టీవ్ టైప్ లో ఉంటుంది. మొత్తం రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్ -1లో 50 ప్రశ్నలకు గానూ ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. పేపర్- 2లో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. ఆన్ లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు మొత్తం 3 గంటల సమయం ఉంటుంది. .

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×