Big Stories

UP: నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. అరగంట పాటు నిలిచిపోయిన రైలు!

Station Master dozes off on duty: అటుగా వెళ్తున్న రైలు ఆ స్టేషన్ వరకు చేరుకుంది. కానీ, అక్కడి నుంచి ఆ ట్రైన్ ముందుకువెళ్లేందుకు సిగ్నల్ రాలేదు. దీంతో ఆ రైలు అక్కడే ఆగింది. దాదాపు అరగంట పాటు ఆ ట్రైన్ ఆగింది. ఏమైందోనని ట్రైన్ లో ఉన్న లోకో పైలట్లు కూడా హారన్ మోగించారు. అయినా స్టేషన్ మాస్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఎంతసేపవుతున్నా గ్రీన్ సిగ్నల్ పడడంలేదు.

- Advertisement -

ఇటు ట్రైన్ లో ఉన్న ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకు ఏమైంది.. ఇంతసేపవుతున్నా సిగ్నల్ ఎందుకు రావడంలేదని అనుమానమొచ్చి స్టేషన్ వద్దకు వెళ్లి చూడగా స్టేషన్ మాస్టర్ నిద్రపోయినట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన అధికారులు సీరియస్ అయ్యారని, అతడి నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన యూపీలో చోటు చేసుకుంది.

- Advertisement -

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఉడిమోర్ జంక్షన్ వద్దకు పట్నా-కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలు చేరుకుంది. అయితే, ఆ స్టేషన్ మాస్టర్ అప్పటికే నిద్రలోకి జారుకున్నాడు. సిగ్నల్ లేకపోవడంతో రైలు నిలిచిపోయింది. అలా దాదాపు అరగంటసేపు అవుతోంది. ఇటు ప్రయాణికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోకోపైలట్ ట్రైన్ హారన్ మోగించాడు. అయినా కూడా ఆ స్టేషన్ మాస్టర్ మేల్కొనలేదు. చివరగా విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: ప్రధానిని మీరెప్పుడైనా టీవీల్లో చూశారా..? : ప్రియాంకా గాంధీ

ఈ విషయమై రైల్వే ఉన్నతాధికారులు ఆ స్టేషన్ మాస్టర్ పై సీరియస్ అవుతూ వివరణ కోరారు. త్వరలోనే అతడిపై తగు క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపినట్లు సమాచారం. స్టేషన్ మాస్టర్ కూడా తన తప్పును ఒప్పుకున్నాడని, క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News