E-Paper
Advertisement

Sunidhi Chauhan: ఫేమస్ సింగర్‌కు చేదు అనుభవం.. ఈవెంట్లో ఆకతాయి పనికి అంతా షాక్..!

Sunidhi Chauhan: ఫేమస్ సింగర్‌కు చేదు అనుభవం.. ఈవెంట్లో ఆకతాయి పనికి అంతా షాక్..!
Advertisement

Sunidhi Chauhan: తన గాత్రంతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన బాలీవుడ్ ఫేమస్ సింగర్ సునిధి చౌహాన్‌కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఓ ఈవెంట్‌లో పాడుతున్న సమయంలో ఓ ఆకతాయి వాటర్ బాటిల్ విసిరేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆమె తాను పాటలు పాడటం ఇష్టం లేదా అని ఆడియన్స్‌ను అడిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సునిధి చౌహన్ ఎన్నో సినిమా పాటలకు తన గాత్రాన్ని అందించడమే కాకుండా.. గత కొన్నేళ్లుగా లైవ్ కచేరీలు కూడా చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె పాటలకు ప్రపంచం నలుమూలల నుంచి కూడా వచ్చి సాంగ్స్ వింటుంటారు. ఈ మధ్య కాలం నుంచి సునిధి చౌహాన్ తన స్పీడ్ పెంచింది.

Advertisement

ఇందులో భాగంగానే ఒక దాని తర్వాత మరొకటి లైవ్ కచేరీలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా డెహ్రాడూన్‌లోని ఎస్జీఆర్ఆర్ యూనివర్సిటీలో ఓ కాన్సెర్ట్‌లో పాల్గొంది. ఆ ఈవెంట్‌లో తన గాత్రంతో జోరుగా పాటలు పాడుతూ ఆడియన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. అలాంటి సమయంలో ఓ యువకుడు ఆకతాయి చర్యకు పాల్పడ్డాడు.

Also Read: కమల్ హాసన్‌ ఫ్యాన్స్‌కు మళ్లీ షాక్.. ఇండియన్ 2 వాయిదా?.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

Advertisement

సునిధి చౌహాన్ సాంగ్ పాడుతున్న సమయంలో ఆమెపై ఓ బాటిల్ విసిరాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే అలాంటి సమయంలో ఎవరైనా కోపంగా రియాక్ట్ అవుతారు. కానీ సునిధి చౌహాన్ మాత్రం ఫన్నీగా స్పందించి ఆడియన్స్ మనసులు దోచుకుంది. ‘‘ఏం జరుగుతోంది? బాటిల్ విసిరితే జరిగేది ఏంటి? షో ఆగిపోతుంది.. అదే కావాలా?’’ అని అడిగింది. దీంతో అక్కడున్న వారంతా వద్దు వద్దు అంటూ అరవడం మొదలు పెట్టారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది.

అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమె అభిమానులు సునిధికి మద్దతుగా నిలిచారు. ప్రతి చోట అలాంటి ఆకతాయిలు ఉంటారని.. ప్రోగ్రాంను చెడగొట్టడానికి వస్తారని కామెంట్లు చేస్తున్నారు. మరొకరు స్పందిస్తూ.. ఈ పని ఎవరు చేశారో.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి.. అప్పుడు మరెవరిపై అలాంటి పనులు చేయకుండా ఉంటారు అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×