BigTV English

UCO Bank Recruitment 2024: యూకో బ్యాంక్‌‌లో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ?

UCO Bank Recruitment 2024: యూకో బ్యాంక్‌‌లో అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ?

UCO Bank Recruitment 2024: కలకత్తాలోని యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం దేశవ్యాప్తంగా ఉన్న యూకో బ్యాంక్ బ్ల్రాంచ్‌ల్లోని ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూకో శాఖల్లో 544 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఖాళీల వివరాలు:
అప్రెంటిస్: 544 పోస్టులు( ఏపీలో 07, తెలంగాణలో 08 ఖాళీలు)
అర్హత: అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తిచేసిఉండాలి.
వయస్సు: 16.07.2024 నాటికి 20- 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు. ఓబీసీలకు మూడేళ్లు. దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
శిక్షణ వ్యవధి: ఏడాది
స్టైఫండ్ వివరాలు: ఈ ఉద్యోగం సాధించిన అనంతరం అప్రెంటిస్‌షిప్ కాలంలో అప్రెంటిస్ కు రూ. 15,000 చెల్లిస్తారు. యుకో బ్యాంక్ నెలవారీగా అప్రెంటిస్ ఖాతాలో రూపాయలు 10,500 చెల్లిస్తుంది. ప్రస్తుతం మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం స్టైఫండ్ 4500 నేరుగా బ్యాంకు ఖాతాల్లో డీబీటీ విధానంలో జమ అవుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తులను పరిశీలించిన తర్వాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. విద్యార్హత ఇతర ప్రమాణాలను ఇంటర్వ్యూ ,పర్ఫామెన్స్ ఆధారంగా బ్యాంకు విచక్షణ మేరకు ఎంపిక జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష ఉంటే ఈ విషయాన్ని బ్యాంక్ వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు. అభ్యర్థులు ఇంటర్వ్యూ రాతపరీక్షలో కనీస మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యాంగులకు 5% సడలింపు ఉంటుంది. ఇంటర్వ్యూ, రాత పరీక్షలో కనీస అర్హతను బ్యాంక్ నిర్ణయిస్తుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజి టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్.

Also Read: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 2700 ఉద్యోగాలు.. అర్హతలివే !


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 02.07. 2024.
రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: 16.07.2024.

Tags

Related News

Group-D Job: గ్రూప్-డీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్.. ఇలా చదివితే ఉద్యోగం మీదే, ఇంకెందుకు ఆలస్యం

SOUTHERN RAILWAY: టెన్త్ అర్హతతో ఇండియన్ రైల్వేలో జాబ్స్.. నెలకు స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం, పూర్తి వివరాలివే..

Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా పోస్టులు.. దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే ఛాన్స్, డోంట్ మిస్

Civils: మీరు డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే సివిల్స్ సాధించడం చాలా ఈజీ.. ఎలానో తెలుసా?

Jobs in ESIC: ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌‌లో ఉద్యోగాలు.. రూ.లక్షల్లో వేతనాలు, దరఖాస్తుకు 5 రోజులే ఛాన్స్..?

IOCL Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచివేతనం, దరఖాస్తు కొన్ని రోజులే గడువు

Big Stories

×