BigTV English

Organ Donation: జెనీలియా,రితీష్‌ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు

Organ Donation: జెనీలియా,రితీష్‌ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు

Riteish Deshmukh Genelia Pledge To Donate Their Body Organs:బాయ్స్‌ మూవీతో హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ నటి జెనీలియా. ఆ తర్వాత బ్యాక్‌ టు బ్యాక్ మూవీస్‌తో ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది.టాలీవుడ్‌లోనూ ఎన్నో మూవీస్‌ చేసి టాలీవుడ్‌లో హాసినీగా వారి మనసులో చెరిగిపోని ముద్రను వేసుకుంది. అలాగే హీరో నితిన్‌తో సై, రామ్‌తో ఢీ, అల్లుఅర్జున్‌తో హ్యపీ మూవీస్‌లో యాక్ట్ చేసి తన యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ని అలరించింది.ఆ తరువాత కొన్ని రోజులకు బాలీవుడ్‌ హీరో రితీష్‌ దేశ్‌ముఖ్‌ను లవ్‌ మ్యారేజ్‌ చేసుకొని ముంబైలో సెటిల్‌ అయింది.మ్యారేజ్ తరువాత జెనీలియా మూవీస్‌కి పుల్‌స్టాప్ పెట్టింది.


ఇటీవలే వేద్‌ అనే మరాఠీ మూవీలో యాక్ట్ చేసింది జెనీలియా. తాజాగా ఈ లవ్‌లీ జోడీ తీసుకున్న నిర్ణయంతో నెటిజన్స్ షాక్‌ అయ్యారు. అంతేకాదు ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అందులోనూ వారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని కోరుతున్నారు. ఇంతకీ వీరు ఏం నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారా..? జెనీలియా, రితీష్‌ దేశ్‌ముఖ్‌ అవయవదానం చేశారు. ఇందుకుగానూ ఆ దంపతులకు నేషనల్ ఆర్గాన్‌ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్గనైజేషన్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఇక జెనీలియా రితీష్ ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతవ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Also Read: ‘మా’కు లేఖ, హేమ సంచలన వ్యాఖ్యలు…


ఈ వీడియోలో రితేష్ మాట్లాడుతూ నేనూ జెనీలియా మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశామని రితేష్,జెనీలియా తెలుపగా..వారికి సంబంధించిన వీడియోని నేషనల్‌ ఆర్గాన్ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆర్డనైజేషన్‌ షేర్ చేసింది. రితేష్‌, జెనీలియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఇద్దరు తమ అవయవాలను దానం చేస్తామని ప్రమాణం చేశారు. వీరి నిర్ణయం ఎందరికో స్పూర్తిగా నిలవాలని రాసుకొచ్చారు.అవయవ దానం ఎంతో గొప్పదానం.దీని వల్ల వ్యక్తి మరణించిన తర్వాత కళ్ళు మరికొన్ని అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి.రితేష్, జెనీలియా తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్‌మీడియా వేదికగా అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×