E-Paper
Advertisement

Assistant Commandant: గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు, అప్లికేషన్ విధానం ఇదే..

Assistant Commandant: గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు, అప్లికేషన్ విధానం ఇదే..
Advertisement

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ సాయుధ బలగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజా ప్రకటన జారీ చేసింది. మొత్తం 349 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సశస్త్ర సీమా బల్ (SSB) విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతాయి.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు.. 

Advertisement

ఈ నోటిఫికేషన్‌లో అత్యధికంగా బీఎస్‌ఎఫ్‌ విభాగంలో 108 పోస్టులు కేటాయించారు. సీఆర్‌పీఎఫ్ లో 106 పోస్టులు ఉన్నాయి. సీఐఎస్‌ఎఫ్ విభాగంలో 70 ఖాళీలు ఉండగా ఎస్ఎస్‌బీలో 53 పోస్టులను భర్తీ చేస్తారు. ఐటీబీపీలో కేవలం 12 పోస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులన్నీ గ్రూప్-ఏ హోదా కలిగినవి కావడం విశేషం.

విద్యార్హత, వయస్సు వివరాలు.. 

Advertisement

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు లభిస్తుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ.. 

మొత్తం నాలుగు దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని శారీరక సామర్థ్య పరీక్షలకు ఆహ్వానిస్తారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు లేదా పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. చివరగా మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

ముఖ్యమైన తేదీల వివరాలు.. 

ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 12వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జులై 19వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://upsconline.nic.in

ALSO READ: Superbikes Under Rs.10 Lakh: రూ. 10 లక్షల లోపు బెస్ట్ సూపర్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×