UPSC Civil Services Exam 2025: సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఐఏఎస్, ఐపీఎస్ కావాలనే కలలు కనేవారికి ఇది గోల్డెన్ ఛాన్స్. వెంటనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 979
దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హత: ఏదైనా పాసైన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 22
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 11
2025 ఫిబ్రవరి 11న సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
ప్రిలిమనరీ ఎగ్జామ్ తేది: 2025 మే 05
400 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరవుతారు. మెయిన్స్ క్వాలిపై అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. చివరికి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది)
1993 ఆగస్టు 2 నుంచి 2004 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి.
అఫీషియల్ వెబ్ సైట్: http://upsconline.gov.in.
Also Read: Medical Officer Jobs in ESIC: ఈ ఉద్యోగం వస్తే.. నెలకు రూ. రూ.1,77,000.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఇదే..
ఐఏఎస్, ఐపీఎస్ సాధించాలనే అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.