BigTV English

Tabu : ‘మగాళ్ల అవసరం బెడ్ వరకే’ అలా నేను ఎప్పుడు అన్నాను… టబు సీరియస్..!

Tabu : ‘మగాళ్ల అవసరం బెడ్ వరకే’ అలా నేను ఎప్పుడు అన్నాను… టబు సీరియస్..!

Tabu :ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు దక్కించుకున్న హీరోయిన్ టబు (Tabu). ప్రస్తుతం ఈమె వయసు 53 సంవత్సరాలు. ఇంకా వివాహానికి మాత్రం దూరంగానే ఉంది. గతంలో ఎంతోమందితో ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. కానీ ఏ ఒక్కటి కూడా నిజం కాలేదు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో వల్లే తన పెళ్లి జరగలేదు అంటూ హాట్ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ. అప్పటినుంచి ఒంటరిగానే జీవిస్తున్న టబు, వ్యక్తిగత జీవితం కంటే కెరియర్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా 53 ఏళ్ల వయసులో కూడా అంతే అందంతో యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తోంది అనడంలో సందేహం లేదు. దీన్ని బట్టి చూస్తే అందాన్ని కాపాడుకోవడానికి టబూ ఎంతలా ప్రయత్నం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.


పెళ్లి వద్దంటూ దుమారం రేపిన టబు..

ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల క్రితం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా తనకు పెళ్లి ఇష్టం లేదని, కేవలం మగాడితో రాత్రి గడిపితే చాలు అన్నట్టుగా కామెంట్ చేసింది అంటూ కొన్ని కథనాలలో వార్తలు వెలువడ్డాయి. దీంతో చాలామంది నెటిజెన్స్.. ఈమె పై విమర్శలు గుప్పించారు. అసలు ఆడవారికి ఇలాంటి మాటలు ఎలా వస్తాయి అంటూ చాలామంది రకరకాలుగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని టబు ఖండించారు.


విమర్శలపై టబు కామెంట్స్..

దీనిపై టబు మాట్లాడుతూ.. 2024లో నేను నటించిన ‘ క్రూ’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వివాహ ప్రణాళికల గురించి ప్రశ్నించారు. దానికి నేను వివాహం పట్ల ఆసక్తి లేదు అని మాత్రమే చెప్పాను. కానీ కొంతమంది మంచం పంచుకోగలిగే వ్యక్తిని కోరుకుంటున్నాను అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేశారు. అంటూ అసహనం వ్యక్తం చేసింది టబు. మగాళ్ళ అవసరం బెడ్ వరకే అని తాను అనలేదని కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ మరి ఇప్పటివరకు టబుపై వస్తున్న విమర్శలకు చెక్ పడుతుందో లేదో చూడాలి.

టబు సినిమాలు..

టబు సినిమాల విషయానికి వస్తే.. 25 సంవత్సరాల తర్వాత ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay kumar ) తో కలిసి నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. వీరిద్దరి కాంబినేషన్లు ‘భూత్ బంగ్లా’ అనే సినిమా రాబోతోంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హారర్ కామెడీ జానర్ లో రాబోతున్నట్లు సమాచారం. 2026 ఏప్రిల్ రెండవ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా గతంలో 2000వ సంవత్సరంలో వీరిద్దరూ కలిసి ‘హేరా ఫేరీ’ అనే చిత్రంలో నటించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు అని తెలిసి అటు అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని, కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకుంటుందని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా టబు ఒక మాటతో క్లారిటీ ఇచ్చేసింది అని చెప్పవచ్చు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×