Big Stories

UPSC: సీఏపీఎఫ్‌లో 506 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

UPSC: కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి గాను యూపీఎస్సా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. బీఎస్ఎఫ్ 186, సీఆర్పీఎఫ్ 120, సీఐఎస్ఎఫ్ 100, ఐటీబీపీ 58, ఎస్ఎస్బీ 42 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

- Advertisement -

అర్హత..

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధలన ప్రకారం పలు వర్గాలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఆగస్టు 1, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ

ఏప్రిల్ 24 నుంచి మే 14 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆన్ లైన్ లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ. 200 ఉంటుంది. పొరపాట్లు ఉంటే మే 15వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు సరిచేసుకునే అవకాశాలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ

ఆగస్టు 4వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. మొదట రాతపరీక్ష పేపర్-1,2 ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి టెస్టులను నిర్వహిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News