Big Stories

MLC Kavitha: కవితకు మరో బిగ్ షాక్.. మే నెలలో తేలనున్న భవితవ్యం.. అంతవరకు జైలులోనే..!

MLC Kavitha: లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి భారీ షాక్ తగిలింది. గతంలో బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని నిరాకరించింది. తాజాగా ఆమె ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు ఈ రెండు పిటిషన్స్ పై తీర్పును వాయిదా వేసింది.

- Advertisement -

లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పులను స్పెషల్ కోర్ట్ రిజర్వ్ చేసింది. లిక్కర్ కేసులో సీబీఐ అరెస్ట్ చేయగా కవిత బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 2వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది.

- Advertisement -

సీబీఐ కేసుతో పాటుగా.. ఈడి లిక్కర్ కేసులో కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు మే 6వ తేదీకి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో మే 7వ తేదీ వరకు జ్యూడిషల్ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత ఉండనున్నారు. కాగా, కవిత భవితవ్యం మే నెలతో ముడిపడి ఉంది.

Also Read: Cadre shock to Ktr: కేటీఆర్, కథ అడ్డం తిరిగింది, పెద్దాయన మాటలు నిజమే?

మే రెండో తేదీన సీబీఐ, మే 6వ తేదీన ఈడీ కేసులో బెయిల్ పై కోర్టు తీర్పుల కోసం కవిత ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఏప్రిల్ 8వ తేదీన ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ను న్యాయమూర్తి కావేరి బవేజ కొట్టివేశారు. అయితే కవిత తరఫు న్యాయవాది రెండు రోజులలోగా కోర్టులో రీజాయిండరీ వేయనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News