E-Paper
Advertisement

RRC Recruitment: రాత పరీక్ష లేదు.. కేవలం మెరిట్ ద్వారానే జాబ్, రైల్వేలో 5,349 ఉద్యోగాలు

RRC Recruitment: రాత పరీక్ష లేదు.. కేవలం మెరిట్ ద్వారానే జాబ్, రైల్వేలో 5,349 ఉద్యోగాలు

ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్రన్ రైల్వే నిరుద్యోగులకు భారీ ఊరటనిస్తూ 5,349 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025-26 సంవత్సరానికి గాను వివిధ డివిజన్లు అలాగే వర్క్‌షాప్‌లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. రైల్వే రంగంలో స్థిరపడాలనుకునే యువతకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు భవిష్యత్తులో నిర్వహించే రైల్వే లెవల్-1 ఉద్యోగ నియామకాల్లో 20 శాతం కోటా కేటాయిస్తారు.

ట్రేడ్ ల వారీగా వెకెన్సీ వివరాలు..

మొత్తం 5,349 పోస్టుల్లో ఫిట్టర్ విభాగానికి అత్యధికంగా 1,614 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ విభాగంలో 1,217 పోస్టులు ఉండగా వెల్డర్ కేటగిరీలో 532 ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు పీఏఎస్‌ఏఏ (PASAA) 280, ఎలక్ట్రానిక్ మెకానిక్ 236, మెకానిక్ డీజిల్ 207, పెయింటర్ 190, కార్పెంటర్ 184 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ మెకానిక్ విభాగంలో 184 ఖాళీలు ఉండగా పైప్ ఫిట్టర్ 176, ప్లంబర్ 136, వైర్‌మ్యాన్ 126 పోస్టులను భర్తీ చేస్తారు. డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ 87, టర్నర్ 75, స్టెనోగ్రాఫర్ 40, మెషినిస్ట్ గ్రైండర్ 25, ఫోర్జర్ హీట్ ట్రీటర్ 16, మెషినిస్ట్ 14, మోటార్ వెహికల్ మెకానిక్ విభాగంలో 10 పోస్టులు కేటాయించారు.

విద్యార్హత..

పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దీనికి అర్హులు. దీంతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ (ITI) సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.

వయస్సు..

వయస్సు విషయానికి వస్తే 2026 మార్చి 23వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సడలింపు లభిస్తుంది. దివ్యాంగులకు పదేళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం..

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పదో తరగతి మార్కులు ఐటీఐ మార్కుల సగటును పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఎంపికైన వారు ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో నిబంధనల మేరకు స్టైపెండ్ చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం..

అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుముగా 100 రూపాయలు నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ 2026 ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 23వ తేదీతో ముగుస్తుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని గడువులోగా దరఖాస్తు పూర్తి చేయాలి.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2026 ఫిబ్రవరి 21

దరఖాస్తుకు చివరి తేది: 2026 మార్చి 23

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrc-wr.com/

ALSO READ: DSSSB Recruitment: భారీ గుడ్ న్యూస్.. 911 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్, ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగం మీదే బ్రో..

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×