High Court Exam: తెలంగాణలో 1673 ఉద్యోగాలకు ఎగ్జామ్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్ డ్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 20వ తేది వరకు ఎగ్జామ్స్ పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, కాపీయిస్ట్, టైపిస్ట్ పరీక్షలు పూర్తి అయిన విషయం తెలిసిందే. నిన్న జరిగిన ఎగ్జామ్ లో వచ్చిన కొన్ని ప్రశ్నలను ఇప్పుడు మనం చూద్దాం. నిన్న జరిగిన జూనియర్ అసిస్టెట్ పరీక్షల్లో జీఎస్ నుంచి 60 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు వచ్చాయి. జీఎస్ నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.
❂ భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు ఎవరు..?
సమాధానం: పీవీ నరసింహ రావు
❂ పాహియాన్ ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చారు..?
సమాధానం: చంద్రగుప్త- 2
❂ ఛేంజింగ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు..?
సమాధానం: మన్మోహన్ సింగ్
❂ రాధా శ్రీధర్ దేనికి ఏ కళకు చెందినవారు..?
సమాధానం: భరత నాట్య నృత్యకారిణి
❂ భారత స్వాతంత్ర్యోద్యమంలో తొలి వీరుడు..?
సమాధానం: మంగళ్ పాండే
❂ యక్షగానం అనే శాస్త్రీయ కళ ఏ రాష్ట్రానికి చెందినది..?
సమాధానం: కర్నాటక
❂ ఇండియన్ అప్ని కా దుకాణ్ ప్రచారాన్ని ప్రారంభించింది..?
సమాధానం: అమెజాన్
❂ ఘటికలు అంటే ఏమిటి..?
సమాధానం: పురాతన విద్యా సంస్థలు
❂ బ్రోకెన్ నెస్ట్ పుస్తక రచయిత ఎవరు..?
సమాధానం: రవీంద్ర నాథ్ ఠాగూర్
❂ In the Bazaars of Hyderabad పుస్తక రచయిత
సమాధానం: సరోజిని నాయుడు
❂ స్వచ్ఛ భారత్ అభియాన్ తదుపరి దశ ఏమిటి..?
సమాధానం: మిషన్ అమృత్
❂ ప్రపంచంలో భారతదేశ భూవైశాల్య శాతం ఎంత..?
సమాధానం: 2.4 శాతం
❂ నిజాంలకు మరియు ఆంగ్లేయులకు మధ్య జరిగిన మొదటి సంధి ఏమిటి..?
సమాధానం: మచిలీపట్నం సంధి
❂ మహాత్మ గాంధీ ప్రారంభించిన బ్యాంక్ పేరు ఏమిటి..?
సమాధానం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
❂ పేదవారి స్నేహితుడు లేదా ధీనబందు అని బిరుదు ఎవరికి కలదు..?
సమాధానం: చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్
❂ సింధు నదికి అతిపెద్ద ఉపనది ఏమిటి..?
సమాధానం: చినాబ్
❂ తెలంగాణలో కృష్ణా మరియు గోదావరి నదులు ప్రవహించని జిల్లా ఏది..?
సమాధానం: మెదక్
❂ రాజ్యాంగంలో హృదయం మరియు ఆత్మ అని ఏ ఆర్టికల్ ను పిలుస్తారు..?
సమాధానం: ఆర్టికల్ 32
❂ నిజాం రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది..?
సమాధానం: 1724
❂ ఆర్టికల్ 51 ఏ దేనికి సంబంధించింది..?
సమాధానం: ప్రాథమిక విధులు
❂ ఫస్ట్ – పాస్ట్- ది పోస్ట్ అనే భావనను రాజ్యాంగంలో ఏ దేశం నుంచి తీసుకున్నారు..?
సమాధానం: బ్రిటిష్
❂ ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ కు నిజాం రాజ్యాన్ని మార్చింది ఎవరు..?
సమాధానం: నిజాం అలీఖాన్
❂ ఆదేశిక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు..?
సమాధానం: ఐర్లాండ్
❂ ఫస్ట్ పరం వీర చక్ర ఎవరికి వచ్చింది..?
సమాధానం: సోమనాథ్ శర్మ
❂ సిటీ ఆఫ్ లేక్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు..?
సమాధానం: ఉదయపూర్
❂ కాకతీయుల కాలంలో కత్తుల ప్రసిద్ధి చెందిన ప్రాంతం..?
సమాధానం: నిర్మల్
❂ ఓరగల్లు నిర్మాత ఎవరు..?
సమాధానం: గణపతి దేవుడు
❂ రుక్మిణీ దేవీ అరండేల్ ఏ శాస్త్రీయ కళకు చెందినవారు..?
సమాధానం: భరతనాట్యం
❂ రామప్ప టెంపుల్ ను నిర్మించింది ఎవరు..?
సమాధానం: రేచర్ల సేనాని
❂ లూనీ నది ఏ రాష్ట్రంలో ఉద్భవించింది..?
సమాధానం: రాజస్థాన్
Also Read: IDBI Recruitment: ఐడీబీఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతోనే జాబ్.. ఇంకా 3 రోజులే గడువు మిత్రమా..!