BigTV English
Advertisement

CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీలో రూ.1000 కోట్ల పెట్టుబడి.. జపాన్‌‌లో సీఎం రేవంత్‌ అగ్రిమెంట్

CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీలో రూ.1000 కోట్ల పెట్టుబడి.. జపాన్‌‌లో సీఎం రేవంత్‌ అగ్రిమెంట్

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనలో బిగ్ డీల్. తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడితో సరికొత్త ప్రాజెక్ట్ చేపట్టేందుకు ‘మారుబేని’ కంపెనీ ముందుకొచ్చింది. రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీలో.. 600 ఎకరాల్లో.. వరల్డ్ క్లాస్ నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెనీ సంస్థ అంగీకరించింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ బృందాన్ని కలుసుకుని.. పెట్టుబడులపై చర్చించారు. ముఖ్యమంత్రి సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ సాకారమైతే.. ఫ్యూచర్ సిటీ రూ.5,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందంటున్నారు.


30 వేల ఉద్యోగాలు..

ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ రంగాల అభివృద్ధిపై మారుబేని ఇండస్ట్రియల్ పార్క్ మెయిన్‌గా ఫోకస్ పెడుతుంది. హైదరాబాద్‌లో మారుబేని కంపెనీ ఏర్పాటుకు స్వాగతం పలికారు సీఎం రేవంత్‌రెడ్డి. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి ఇండస్ట్రియల్ పార్కు ఇదేనన్నారు. మారుబేనితో దాదాపు 30వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అన్నారు. దేశంలోనే ఫస్ట్.. నెట్ జీరో సిటీగా.. ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుందని రేవంత్ ఆకాంక్షించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం.. నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా మారుబేని ప్రాజెక్టు చేపడుతుందని చెప్పారు.


సీఎం రేవంత్ విజన్ సూపర్

మారుబేని సంస్థకు 65 దేశాలలో.. ఫుడ్, అగ్రీ ప్రొడక్ట్స్, మెటల్స్, మైనింగ్, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ముందు వరుసలో ఉంటామని చెప్పారు మారుబేని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురా. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి విజన్‌ను అభినందించారాయన.

Also Read : ఓ చిన్నారిపై పేపర్లో న్యూస్.. సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేశారంటే.. 

సోని కార్యాలయంలో సీఎం రేవంత్

జపాన్‌లో సోనీ ప్రధాన కార్యాలయంను సందర్శించింది సీఎం రేవంత్ అండ్ తెలంగాణ రైజింగ్ టీమ్. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న ప్రాజెక్టులను కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందంతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. యానిమేషన్, VFI, గేమింగ్ రంగాలలో.. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను సోనీ కంపెనీ ప్రతినిధులకు.. తెలంగాణ అధికారుల బృందం వివరించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ప్రతిపాదన చేశారు. హైదరాబాద్‌లో అత్యాధునిక, ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Related News

Collages Bandh: రూ. 5 వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీలు బంద్..!

CP Sajjanar: డ్యూటీలో తప్పులు చేస్తే చర్యలు తప్పవు.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్-బీజేపీలకు నవంబర్ సెంటిమెంట్ మాటేంటి?

High Court: మాయం అవుతున్న చెరువులు.. రెవెన్యూ శాఖ అధికారుల పై హైకోర్టు సీరియస్

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

Deputy CM Bhatti: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి

Jubilee hills elections: జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత మాది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills bypoll: కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు.. చలో ఏదో ఒకటి తేల్చుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

×