BigTV English

Rajouri Terror Attack: జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి

Rajouri Terror Attack: జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి

Rajouri Terror Attack: జమ్మూ కశ్మీర్ లోని పూంఛ్‌ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రెండు సైనిక వాహనాలపై జరిగిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు అమరులయ్యారు. బుప్లియాజ్ సమీపంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో రెండ్రోజులుగా భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే రాజౌరీ-సురన్ కోటే రహదారిపై వెళ్తుండగా.. సావ్ని శివార్లలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి.


ధేరా కి గాలి, బుఫ్లియాజ్‌ మధ్య గల ధత్యార్‌ మోర్‌ వద్ద మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. ఉగ్రమూకల దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పూంచ్ జిల్లాలో ఆర్మీ ప్రయాణిస్తున్న రెండు వాహనాలపై టెర్రరిస్టులు విచక్షణరహితంగా కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యేలోగానే ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి అదనపు బలగాలతో పాటు అంబులెన్స్ లను తరలించామని అధికారులు తెలిపారు.

జమ్మూకశ్మీర్‌లోని జవాన్లను తరలిస్తున్న గురువారం సాయుధ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురు సైనికులు అమరులయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. సురాన్‌కోట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ధేరా కి గాలి, బుఫ్లియాజ్‌ మధ్య గల ధత్యార్‌ మోర్‌ వద్ద మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ దాడి జరిగింది. విశ్వసనీయ నిఘా సమాచారంతో బుధవారం రాత్రి ధేరా కి గాలి ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రక్షణ శాఖ అధికారప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ సునీల్‌ బర్త్వాల్‌ తెలిపారు. ఈ ఆపరేషన్‌ కోసం అదనంగా సైనికులను తరలిస్తున్న ఓ ట్రక్కు, జిప్సీలపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారన్నారు. ఈ దాడికి తమదే బాధ్యత అని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా అనుబంధ సంస్థ పీపుల్స్‌ యాంటీ ఫాసిస్ట్‌ ఫ్రంట్‌ ప్రకటించుకుంది.


Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×