BigTV English

Satellites Launch in China: ఒకే రాకెట్‌లో 41 శాటిలైట్లు లాంచ్.. చైనా నేషనల్ రికార్డ్..

Satellites Launch in China: ఒకే రాకెట్‌లో 41 శాటిలైట్లు లాంచ్.. చైనా నేషనల్ రికార్డ్..

Satellites Launch in China: చైనా.. ఎప్పుడూ అన్ని విషయాల్లో ఇతర దేశాలతో పోటీ పడాలనే ఆలోచిస్తూ ఉంటోంది. అందుకే రిస్క్ అని తెలిసినా కొన్ని ప్రయోగాలను చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ రంగాల్లో చైనా అన్ని దేశాలకు స్ఫూర్తిగా నిలవాలనే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా 41 రాకెట్లను ఒకే శాటిలైట్‌లో పంపించి మరోసారి ప్రపంచ దృష్టిని తనవైపు ఆకర్షించింది. పైగా ఈ లాంచ్‌తో చైనా కొత్త నేషనల్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది.


నార్త్ చైనాలోని తాయుయాన్ లాంచ్ సెంటర్ నుండి లాంగ్ మార్చ్ 2డీ రాకెట్ అంతరిక్షంలోకి చేరుకుంది. దీని ద్వారా ఒకేసారి 41 చిన్న శాటిలైట్స్ ఆర్బిట్‌లోకి విడుదల అయ్యాయి. ఇందులో చైనాకు సంబంధించిన పలు కమర్షియల్ శాటిలైట్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు చైనా ఒకే లాంచ్‌లో 26 శాటిలైట్లను లాంచ్ చేసిన రికార్డ్‌ను సాధించింది. ఇప్పుడు ఏకంగా 41 శాటిలైట్ల లాంచ్‌తో ముందు ఉన్న రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఒక స్పేస్ ఎక్స్ ట్రాన్స్‌పోర్టర్ 1 మిషన్ ద్వారా 143 శాటిలైట్ల లాంచ్ రికార్డ్ అయితే చెక్కుచెదరకుండా ఉంది.

తాజాగా లాంచ్ అయిన శాటిలైట్లు.. సీజీఎస్‌టీ జిలిన్ 1 కమర్షియల్ రిమోట్ సెన్సింగ్ కాన్స్‌టిలేషన్‌కు సాయంగా ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. 2025లోపు ఒకేసారి 300 శాటిలైట్లను లాంచ్ చేయాలని చైనా టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ దానికంటే ముందు ఈ ఏడాది చివరిలోపు 138 జిలిన్ 1 శాటిలైట్ల లాంచ్‌పై సీఎస్‌జీటీ దృష్టిపెట్టింది. జిలిన్ 1లో ఒక్కొక్క శాటిలైట్ ఒక్కొక్క విధంగా ఉంటుందని వారు చెప్తున్నారు.


ముఖ్యంగా పీటీ02ఏ01, 02 శాటిలైట్లు.. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవని శాస్త్రవేత్తలు అంటున్నారు. అవి హై స్పీడ్ ఇంటర్ శాటిలైట్, శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేట్ టెక్నాలజీలను గమనిస్తూ ఉండడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ప్రస్తుతం జిలిన్ శాటిలైట్ల తయారీ, లాంచ్ లాంటి విషయాలను సీజీఎస్‌టీ సంస్థ చూసుకుంటోంది. చైనాలో శాటిలైట్ల తయారీ సంస్థగా దీనికి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే ఈ ఏడాదిలో చైనా చేసిన శాటిలైట్ల లాంచ్‌లలో ఇది 24గా నిలిచింది. 2023లోపు ఇంకా 200 స్పేస్‌క్రాఫ్ట్స్‌ను లాంచ్ చేయాలని చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×