BigTV English

6G Services : 6జీ సేవలపై మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఫోకస్..

6G Services : 6జీ సేవలపై మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఫోకస్..
6G Services

6G Services : ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలు ఊపందుకుంటున్నాయి. నెట్‌వర్క్ స్పీడ్‌ను, ఇబ్బందులు లేని వాయిస్ కాల్స్‌ను అందించడం కోసం 5జీ ప్రవేశపెట్టాయి టెలికాం సంస్థలు. అయితే 5జీ ఇంకా పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి రాకముందే.. 6జీ సేవల ప్రస్తావన వెలుగులోకి వచ్చింది. ముందుగా బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎమ్‌డబ్ల్యూసీ) దీని గురించి ఒక ఆలోచనను ముందుకు తీసుకురానుంది.


టెక్నాలజీలో ఆసక్తి ఉన్నవారి కోసం బార్సిలోనాలో ఒక వారం రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యంగా చర్చించబోయే అంశం 6జీ. 6జీ సర్వీసులు మార్కెట్లోకి రావడానికి చాలా సమయం ఉన్నా.. ఎమ్‌డబ్ల్యూసీ మాత్రం దీని గురించి చర్చలు జరిపించడానికి ఆసక్తి చూపిస్తోంది. కేవలం కనెక్టివిటీ విషయంలోనే కాకుండా మరెన్నో ఇతర సేవలను కూడా 6జీ ద్వారా అందించాలని ఎమ్‌డబ్ల్యూసీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇతర రీసెర్చ్ గ్రూప్స్‌తో కలిసి ఎమ్‌డబ్ల్యూసీ మంతనాలు చేసింది.

ప్రస్తుతం 5జీ వల్ల యూజర్లు ఆనందంగా ఉన్నా.. దానిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండడంతో దానిని తరచుగా ఉపయోగించడానికి యూజర్లు ఇష్టపడతారు. అయితే 5జీ నెట్‌వర్క్‌తో 25 జీబీని కూడా ఒకేరోజులో పూర్తి చేయవచ్చు. అలాంటి సమయంలో ఫోన్‌లో డేటా తొందరగా పూర్తయిపోతుంది. ఇదే సమస్య 6జీ విషయంలో కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందుకే రోజుకు ఎంత నెట్‌వర్క్‌ను యూజర్లకు అందించాలి, ఎంత రేట్‌తో అందించాలి అనే విషయాలపై ఎమ్‌డబ్ల్యూసీ ఫోకస్ చేయనుంది.


6జీ సేవలు పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నెట్‌వర్క్ వినియోగం పెరుగుతున్నకొద్దీ పర్యావరణానికి హాని పెరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా నెట్‌వర్క్‌ను పెంచే ప్రయత్నాలు చేయాలని వారు సూచిస్తున్నారు. ఈ విషయంపై కూడా ఎమ్‌డబ్ల్యూసీ నిర్వహించే సమావేశాల్లో చర్చలు జరగునున్నాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×