Maternal Mortality : ఒకప్పుడు ఇంత సైన్స్ లేదు. ఇంత టెక్నాలజీ లేదు. హెల్త్ సెక్టార్‌లో కూడా ఇలాంటి అభివృద్ధి లేదు. అందుకే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా మరణానికి దారితీసేవి. ముఖ్యంగా ప్రసవాల సమయంలో తల్లి లేదా బిడ్డ.. ఎవరో ఒకరు మాత్రమే భద్రంగా బతికి బయటపడే అవకాశం ఉండేది. ఇప్పటికీ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ప్రసవాల సమయంలో మరణాలు అనేవి ఎక్కువగా తగ్గడం లేదు. దానికి శాస్త్రవేత్తలు ఒక కొత్త పరిష్కారంతో ముందుకొచ్చారు.
ప్రసవాల తర్వాత కొందరు మహిళలు అధిక రక్తస్రావం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దానికోసమే శాస్త్రవేత్తలు కొత్త రకమైన డ్రగ్స్‌ను కనిపెట్టారు. కోవిడ్ వల్ల కూడా గర్భిణి స్త్రీలపై ప్రత్యక్షంగా మాత్రమే కాదు.. పరోక్షంగా కూడా ప్రభావం చూపించింది. మహమ్మారి సమయంలో ఎవరూ ఇంట్లో నుండి బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు మందులు తెచ్చుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది పరోక్షంగా బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం చూపించింది.
కోవిడ్ సమయంలో ఇది మాత్రమే కాదు.. హెల్త్ సెక్టార్ మరెన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కుంది. అలాంటి సమయాల్లో కూడా మహిళలు ధైర్యంగా ప్రసవాలను కొనసాగించారు. కానీ అందరికీ ఆ యాక్సెస్ లభించలేదు. దీని వల్ల కూడా ఎన్నో ప్రవస మరణాలు సంభవించాయి. అందుకే వీటిని తగ్గించడం కోసం టెక్నాలజీ సాయం తీసుకోవాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం దీనికోసం ఆక్సిటోసిన్ అనే డ్రగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది రక్తస్రావాన్ని ఆపుతుంది కానీ, దీని వల్ల మహిళల టెంపరేచర్‌పై ప్రభావం పడుతుందని వైద్యులు గుర్తించారు.
ఒకవైపు రక్తస్రావాన్ని అదుపు చేయాలి, మరోవైపు టెంపరేచర్ కూడా అదుపులో ఉండాలి.. ఈ రెండు ఒకే డ్రగ్‌తో జరగాలి అని శాస్త్రవేత్తలు ప్రయోగాలు మొదలుపెట్టారు. దానికి తగిన డ్రగ్‌ను తయారు చేశారు కూడా. ప్రస్తుతం ఈ డ్రగ్స్ అనేవి టెస్టింగ్ స్టేజ్‌లో ఉందని, త్వరలోనే వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడతామని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు. కానీ కచ్చితంగా ఇవి ప్రసవం తర్వాత మహిళల రక్తస్రావాన్ని కంట్రోల్ చేయడంతో పాటు ప్రసవ మరణాలను కూడా అదుపు చేస్తాయని వారు భావిస్తున్నారు.