Avinash Reddy Latest News(Andhra news updates): అవినాష్ రెడ్డి బెయిల్ ఆర్డర్ కాపీలో రెండు మీడియా సంస్థల తీరును తప్పుబట్టారు హైకోర్టు జడ్జి. తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా కథనాలు ప్రసారం చేశారంటూ ఆ రెండు మీడియా సంస్థల తీరుపై జడ్జి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చర్చల్లో కొందరి ద్వారా తనపై ఆరోపణలు చేయించారని.. దాంతో ఓ దశలో తాను కేసు విచారణ నుంచి కూడా తప్పుకోవాలని అనుకున్నానని తెలిపారు. సస్పెండై, నిర్బంధించబడిన ఓ జడ్జి.. తనకు డబ్బు సంచులు వచ్చాయని అసత్య ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు.
తనపై ఆరోపణలు చేయడం మీడియాకు హుందాగా ఉండదన్న న్యాయమూర్తి.. ఇలాంటి వ్యవహారాలను కోర్టు తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని.. ఆ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది చీఫ్ జస్టిస్‌కు వదిలేస్తున్నామని అన్నారు.
రెండు ఛానెళ్లలో మే 26న జరిగిన చర్చలకు సంబంధించిన వీడియోలు డౌన్‌లోడ్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇలాంటి వార్తలపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి.