BigTV English

A setback for Pakistan: ఆటోమొబైల్ రంగంలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ.. టయోటా వల్లే..

A setback for Pakistan: ఆటోమొబైల్ రంగంలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ.. టయోటా వల్లే..

A setback for Pakistan : ఏ సంస్థ అయినా, ఏ రంగంలో ఉన్నా.. అన్ని కష్టపడేది లాభాల కోసమే. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అందుకే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, రాష్ట్రాల్లో బిజినెస్ చేయడానికి, అక్కడ బ్రాంచ్‌లు స్థాపించడానికి సంస్థలు ఆసక్తి చూపిస్తాయి. కానీ ఒకవేళ ఆ దేశంలో తమకు లాభాలు రావని అనిపిస్తే మాత్రం వెంటనే అక్కడ నుండి కదలడానికి సిద్ధపడతాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో అదే జరగుతోంది. ఆటోమొబైల్ రంగంలో పాకిస్థాన్ ఎదురుదెబ్బను ఎదుర్కుంటోంది.


ప్రస్తుతం పాకిస్థాన్‌లో రాజకీయ పరిస్థితులు ఏమీ బాలేదు. దీంతో ప్రతీ రంగంపై దీని ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా ఆ దేశం తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. అందుకే అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ కంపెనీలు ఒక్కొక్కటిగా బ్రాంచ్‌లను మూసేస్తూ వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితమే యూకేకు చెందిన ఆయిల్ కంపెనీ ‘షెల్’.. పాకిస్థాన్‌లో బ్రాంచ్‌ను మూసేసి, కార్యకలాపాలను ఆపేసింది. తాజాగా ఆటోమొబైల్ సంస్థ టయోటా కూడా పాకిస్థాన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని అధికారికంగా ప్రకటించింది కూడా.

పాకిస్థాన్‌లో బిజినెస్‌ను కొనసాగించాలంటే వనరుల విషయంలో టయోటా చాలారోజులుగా ఇబ్బందులు ఎదుర్కుంటుందని అక్కడి మీడియా బయటపెట్టింది. దీంతో అక్కడ ప్రొడక్షన్ నిలిచిపోయింది. ఇన్వెంటరీ కొరత కారణంగానే అక్కడ ప్రొడక్షన్ ఆపేసి, బ్రాంచ్‌లను నిలిపివేస్తున్నట్టుగా టయోటా ఓపెన్ లెటర్ ఇచ్చింది. టయోటాతో పాకిస్థాన్‌కు ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. ఇలా ఎన్నో ఏళ్లుగా ఇలా పలుమార్లు పాకిస్థాన్ బ్రాంచ్‌ల విషయంలో టయోటా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఒకసారి బ్రాంచ్‌లను మూసేసి, మళ్లీ తిరిగి ప్రారంభించింది కూడా.


గత ఏడాది డిసెంబర్‌లో పలు ఇతర కారణాల కారణంగా టయోటా.. పాకిస్థాన్‌లో ప్రొడక్షన్‌ను నిలిపేసింది. ఇప్పుడు ఇన్వేంటరీ ఇబ్బందుల వల్ల మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కానీ ఈసారి పర్మనెంట్‌గా టయోటా తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్థాన్ ఆర్థిక రంగం దెబ్బతింటుందని ఆ దేశ నిపుణులు భావిస్తున్నారు. టయోటాను చూసి మరికొన్ని కంపెనీలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే పాకిస్థాన్ ఆర్థిక రంగం కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుందని వారు భయపడుతున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×